జాతీయ వార్తలు

భక్తి శ్రద్ధలతో రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: రంజాన్ పండగ సందర్భంగా భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేరువేరు సందేశాల్లో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సౌభ్రాతృత్వం, సోదర భావన, సామరస్యం, సుఖ సంతోషాలతో ప్రజలు శాంతి జీవనం కొనసాగించాలని వారు ఆకాక్షించారు. భారత సమాజం సామరస్యానికి ప్రతీకని ప్రధాని సందేశంలో తెలిపారు. కాగా రంజాన్ పండగను దేశ వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసు, ముంబాయి, కోల్‌కొతా, బెంగళరు తదితర నగరాల్లో ముస్లింలు మసీదుల వద్ద ప్రార్ధనలు జరిపారు. కోల్‌కొతాలో రెడ్‌రోడ్ వద్ద జరిగిన ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. నగరంలోని టిప్పుసూల్తాన్, నకోడా మసీదుల వద్ద పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థనలు చేశారు. అనేక నగరాల్లో ప్రార్థనల తర్వాత ముస్లింలను వివిధ వర్గాలు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి కె పళనిస్వామి, డిఎంకె నేత ఎంకె స్టాలిన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రాలు..
రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రార్థనల్లో ముస్లింలకు శుభాకాంక్షలు
తెలుపుతున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
*కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ ఇంటివద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హో మంత్రి రాజ్‌నాథ్ సింగ్.