జాతీయ వార్తలు

జూలై 18నుంచి పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 తేదీ నుంచి మొదలై ఇరవై రెండు రోజుల పాటు కొనసాగి ఆగస్టు 10న ముగుస్తాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే రాజ్యసభకు కొత్త ఉపాధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. బీజేపీకి, ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ప్రస్తుత పరిస్థితుల్లో జరుగనున్న ఈ సమావేశాలు గత సమావేశాల మాదిరిగానే గొడవ, గందరగోళానికి గురి కానున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్టల్ల్రో లోక్‌సభ, శాసనసభ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న ప్రతిపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీపై పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సిద్దవౌతున్నాయి. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజీ కురియన్ పదవీకాలం జూలై 30 తేదీతో ముగుస్తుంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను మరోసారి రాజ్యసభకు పంపించేందుకు
నిరాకరించింది. దీనితో ఆయన స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. దాదాపు 41 సంవత్సరాల తరువాత కాంగ్రేసేతర నాయకుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఏర్పడింది. గత 41 సంవత్సరాల నుండి కాంగ్రెస్‌కు చెందిన నాయకుడే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు భైరాంవ్ సింగ్ షెకావత్ ఉపరాష్టప్రతి పదవి చేపట్టిన తరువాత కూడా కాంగ్రెస్‌కు చెందిన నాయకుడే రాజ్యసభ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఇప్పుడు మొదటి సారిగా కాంగ్రేసేతర నాయకుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. రాజ్యసభలో బీజేపీ 69 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 51 సీట్లతో రెండో స్థానంలో ఉన్నది. ఎన్‌డీఏ కూటమికి 106 మంది సభ్యుల మద్దతు ఉంటే, ప్రతిపక్షానికి 117 మంది సభ్యుల మద్దతు ఉన్నది. రాజ్యసభ మొత్తం సీట్లు 245. డిప్యూటీ చైర్మన్ పదవిని గెలుచుకునేందుకు 123 ఓట్లు అవసరం ఉంటాయి. ఉపాధ్యక్ష పదవికి కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో కాంగ్రెస్ కంటే ఇతర ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా తమకు నచ్చిన వ్యక్తిని డిప్యూటీ చైర్మన్ పదవికి ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ లక్ష్య సాధన కోసం టీఎంసీ లేదా బీజేడీ అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అటు బీజేపీ ఇటీవల తమకు దూరమైన శివసేనను దువ్వుతోంది. రాజ్యసభ డిడ్యూటీ చైర్మన్ పదవి ఇవ్వజూపుతోంది. ప్రతిపక్షానికి చెందిన ప్రాంతీయ పార్టీల తరపున టీఎంసీ సీనియర్ నాయకుడు సుఖేందురాయ్, బీజూ జనతాదళ్‌కు చెందిన ప్రసన్న ఆచార్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.