జాతీయ వార్తలు

సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: జూలై 18 నుండి ఆగస్టు 10 తేదీ వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ సహాయ, సహకారాలను అందజేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ విజప్తి చేశారు. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల
మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం అనంతకుమార్ విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుండి ఆగస్టు 10 వరకు జరపాలని నిర్ణయించామని, ఈ సమావేశాల 18 పని దినాల్లో ఈ మధ్య జారీ చేసిన ఆరు ఆర్డినెన్సులను ఆమోదించటంతోపాటు 2017 రాజ్యాంగ సవరణ బిల్లు, ముస్లిం మహిళల హక్కుల (ట్రిపుల్ తలాక్) పరిరక్షణ బిల్లు, ట్రాన్స్‌జెండర్ పెన్షన్ బిల్లు, బాల, బాలికల విద్యా హక్కుకు సంబంధించిన బిల్లులను ప్రతిపాదించి ఉభయ సభల ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అనంతకుమార్ చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జూలై నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఈ సమావేశాల్లోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.