జాతీయ వార్తలు

త్రిపుర, బెంగాల్ అరాచకలపై జూలైలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు జూలైలో జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ (ఎం) నిర్ణయించింది. మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ ఒక ప్రకటన చేస్తూ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల అనంతరం నలుగురు పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, సుమారు వంద పార్టీ, సంస్థల కార్యాలయాలు కూల్చివేయడం, ఆక్రమించుకోవడం జరిగిందని పార్టీ ఆరోపించింది. ఈ చర్యలతో సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు నిరాశ్రయులయ్యారని, వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలు, పార్టీ కార్యాలయాల్లో తలదాచుకుంటున్నారని తెలియజేసింది. పలు సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంతాలను సందర్శించడానికి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తన ఎమ్మెల్యేల బృందంతో మాణిక్ సర్కార్ వెళ్లడానికి ప్రయత్నిస్తే దానిని ప్రభుత్వం అడ్డుకుందని సిపిఐ(ఎం) ఆరోపించింది.
చట్టప్రకారం కేబినెట్ ర్యాంక్ అధికారాలున్న ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ప్రజాప్రతినిధుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. అలాగే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టిఎంసి పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అధికారులతో కుమ్మకై తమ కార్యకర్తలపై తీవ్ర దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అక్కడ జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా ఒక ప్రహాసనమని సీపీఐ (ఎం) విమర్శించింది. ఆ ఎన్నికల్లో పది మంది తమ కార్యకర్తలు మృతి చెందారని తెలియజేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో వచ్చే నెలలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియజేసింది.