జాతీయ వార్తలు

తమిళనాడు బహిష్కృత ఎమ్మెల్యేల కేసు విచారణ 27న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: తమిళనాడు అసెంబ్లీ నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేల కేసును ఈ నెల 27న సుప్రీంకోర్టు విచారించనుంది. తమ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ చేసి సుప్రీంకోర్టులో విచారణ జరపాలని 18మంది బహిష్కృత ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించి కేసును బుధవారం విచారిస్తామని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 18న అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో ఏఐడిఎంకె విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించిన దినకరన్ గ్రూపునకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్‌పాల్ బహిష్కరణ వేటు వేశారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 18న మద్రాస్ హైకోర్టులో ఇద్దరు జడ్జిలతో కూడిన బెంచి పరస్పర విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. ఒక జడ్జి స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించగా, మరొక జడ్జి దానిని విభేదించారు. అయితే కేసును మూడో జడ్జికి బదలాయించాలని నిర్ణయించారు. అప్పటిదాకా యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుతో తాజాగా ఎన్నికలు జరిపే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని 18 మంది ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ వికాస్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది అత్యవసరమైన కేసని వెంటనే విచారించాలని ఆయన కోరారు. ఇప్పటికే అనేకమంది అభిమానులు, ప్రజలు కేసును విచారించే మూడో జడ్జి ఎవరూ అంటూ అనేక వాట్సాప్ మెస్సేజ్‌లు పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, సంజయ్ కిషన్ కోల్ వ్యాఖ్యానిస్తూ వాట్సాప్ మెస్సేజ్‌ల జోలికి తాము పోదలుచుకోలేదని, కేసును జూన్ 27న విచారిస్తామని తెలిపారు.