జాతీయ వార్తలు

బీజేపీకే మా మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 25: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకే మద్దతు ఇస్తామని రాష్ట్రీయ షియా సమాజ్(ఆర్‌ఎస్‌ఎస్) వెల్లడించింది.‘బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీకే షియా ముస్లింలు మద్దతు ఇస్తారు. అలాగే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికీ మా మద్దతు ఉంటుంది’అని రాష్ట్రీయ షియా సమాజ్ అధినేత బుక్కల్ నవాబ్ వెల్లడించారు.‘రాష్ట్రంలోని షియా ముస్లిం సమాజమంతా 2019 ఎన్నికల్లో మోదీకి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆయనను మళ్లీ ప్రధాన మంత్రిగా చూడాలన్నదే వారి ఆశ’అని బీజేపీ ఎమ్మెల్సీ నవాద్ స్పష్టం చేశారు. ఒక్క బీజేపీలోనే షియా ముస్లిలంకు గౌరవం, ప్రాధాన్యత దక్కుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాష్టమ్రంత్రి మోసిన్ రజా, జాతీయ మైనారిటీస్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఘయోరుల్ హస్ రజ్వీ,యూపీ మైనారిటీ కమిషన్ చైర్మన్ హైదర్ అబ్బాస్ షియా ముస్లింలేనని బీజేపే వారికి ఉన్నతపదవులు కట్టబెట్టిందని ఆయన పేర్కొన్నారు. బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాల హయాంలో షియా ముస్లింలు తీవ్ర వేధింపులకు గురయ్యారని ఆయన ఆరోపించారు. 2017 వరకూ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న నవాబ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తరువాత బీజేపీ టికెట్‌పై మళ్లీ ఎమ్మెల్సీ అయ్యారు.