జాతీయ వార్తలు

ఢిల్లీలో పెరుగుతున్న మలేరియా కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: గత వారం రోజులుగా ఢిల్లీలో మలేరియా కేసులు 11 నమోదైనట్టు అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో ఈ సీజన్‌లో మలేరియా కేసుల సంఖ్య 40కు చేరుకుంది. కాగా, జూన్ 16,23 మధ్య నాలుగు డెంగ్యూకేసులు మాత్రమే నమోదు కాగా, మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన 40 కేసుల్లో జూన్‌లో 19, మేలో 17, ఏప్రిల్, మార్చి నెలల్లో ఒకటి చొప్పున ఉన్నాయి. అదే సమయంలో మొత్తంనమోదైన 28 డెంగ్యూ కేసుల్లో ఆరు జనవరిలో, మూడు ఫిబ్రవరిలో ఒకటి మార్చిలో, రెండు ఏప్రిల్‌లో నమోదు కాగా, గత నెలలో పది, ఈ నెలలో ఆరు నమోదయ్యాయి. ఇంత ఎక్కువ సంఖ్యలో మలేరియా కేసులు నమోదు కావడం సాధారణం ఏమీ కాదని ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఒక సీనియర్ డాక్టర్ పేర్కొన్నారు. మలేరియా వ్యాపించకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. దోమల లార్వాలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు. వాటర్‌కూలర్లు వంటివి వాడకపోతే అందులో నీరు ఉండకుండా ఎండబెట్టాలని, శరీరమంతా కప్పే దుస్తులు ధరించాలని సూచించారు. సాధారణంగా అంటువ్యాధులు జూలై-నవంబర్ మధ్య ఎక్కువగా నమోదవుతూ ఉంటాయని అన్నారు. ఇలావుండగా, డెంగ్యూవాధితో గత సంవత్సరం ఢిల్లీలో పది మంది మృతి చెందారు. అలాగే 9,271 మలేరియా, 940 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి.