జాతీయ వార్తలు

రామాలయ నిర్మాణానికి మళ్లీ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: అయోధ్యంలో రామమందిరం నిర్మాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారభించాలన్న సంకేతాలు విశ్వహిందూ పరిషత్ ఇచ్చింది. అయోధ్యపై సుప్రీం కోర్టు రెండు మూడు నెలల్లో తీర్పు ఇవ్వని పక్షంలో ఏం చేయాలన్న దానిపై పలువురు పీఠాధిపతులు, సాధువులతో వీహెచ్‌పీ సంప్రదింపులు జరపనుంది. ఢిల్లీలో జరిగిన వీహెచ్‌పీ వ్యవస్థాగత మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీహెచ్‌పీ వర్కింగ్ కమిటీ చైర్మన్ అలోక్ కుమార్ సోమవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. మండలి సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించినట్టు ఆయన తెలిపారు. గోసంరక్షణ ఒకటి, రోహింగ్యా ముస్లింలకు సంబంధించింది మరొకటని అని ఆయన చెప్పారు.
అయోధ్యంలో రామమందిరం నిర్మాణం విషయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు కుమార్ తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వచ్చేవరకూ ఆగడమా? లేక ఉద్యమాన్ని పునఃప్రారంభించాలా అన్న దానిపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై సాధువులు, పీఠాధిపతులతో సంప్రదించాలని నిర్ణయించినట్టు అలోక్ కుమార్ స్పష్టం చేశారు. రోజువారీగా సుప్రీం కోర్టు అయోధ్యపై విచారణ చేపడుతుందన్న విశ్వాసం తమకుందని ఆయన అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో న్యాయబద్ధంగానే రామమందిరం నిర్మించాలని తాము కోరుకుంటున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అయితే ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున భవిష్యత్ కార్యాచరణపై సాధువులు, హిందూ పెద్దలతో సంప్రదించాలని నిర్ణయించినట్టు వీహెచ్‌పీ వెల్లడించింది. వీహెచ్‌పీ మాజీ నాయకుడు ప్రవీణ్ తొగాడియా కొత్త సంస్థను ఏర్పాటు చేసినా, దాని ప్రభావం వీహెచ్‌పీపై ఏ మాత్రం ఉండదని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ ఒక వ్యక్తి అభిప్రాయమో, లేక వ్యక్తిగత ప్రయోజనం కోసమో పనిచేసేది కాదని అలోక్ కుమార్ అన్నారు. బహుళ నాయకత్వం, సమష్టి అభిప్రాయాలతో హిందూ సిద్ధాంతాల కోసం వీహెచ్‌పీ పనిచేస్తోందని ఆయన చెప్పారు.