జాతీయ వార్తలు

హిట్లర్-ఇందిరా ఇద్దరూ ఇద్దరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ఎమర్జన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జర్మన్ నియంత హిట్లర్‌తో పోల్చారు. మనదేశంలో ఎమర్జన్సీని 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించారు. ఎమర్జన్సీ విధించి ఈరోజుకు 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రి జైట్లీ ఆ చీకటిరోజుల గురించి పేర్కొంటూ ట్వీట్ చేశారు. హిట్లర్, ఇందిరాగాంధీ ఇద్దరూ కూడా ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆయన ఆరోపించారు. వారిద్దరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృత్వ వ్యవస్థగా మార్చడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు. హిట్లర్ తాను అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష నేతలను అరెస్ట చేసి మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా మార్చారని జైట్లీ పేర్కొన్నారు. హిట్లర్‌లాగే ఇందిరాగాంధీ కూడా భారత్‌ను వంశపారంపర్య ప్రజాస్వామ్యదేశంగా మార్చారని ఆరోపించారు. ఎమర్జన్సీ రోజుల్లో ఇందిరా అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. దేశంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విపక్షాలు, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. దేశంలో రాజకీయ కార్యకలాపాలు నిలిచిపోయాయని అన్నారు. సత్యాగ్రహాలు, ఆందోళనలు చేసిన వారిని ఉక్కుపాదంతో అణచివేశారని ఆయన చెప్పారు. దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ ప్రాథమిక హక్కుల రక్షణకు ఉద్దేశించిన 359 ఆర్టికల్‌ను కాదని 352 ఆర్టికల్ అమలు చేసి దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని ఆయన తెలిపారు. హిట్లర్ పలువురు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసినట్టే, తనను ప్రశ్నించిన విపక్షాలను ఇందిరాగాంధీ జైల్లో పెట్టించారని ఆరోపించారు. అంతేకాకుండా పౌరుల ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేసిందని, మీడియా, ఇతర సంఘసేవికులపై ఆంక్షలు విధించి వారిని సైతం జైలుకు పంపారని అన్నారు. ఎమర్జన్సీ సమయంలో తాను సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లినట్టు ఆయన చెప్పారు.

చిత్రం..కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ