జాతీయ వార్తలు

అధికారంలోకి రాకముందు జీఎస్టీని ఎందుకు వ్యతిరేకించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన జీఎస్టీని ‘నిజాయితీ వేడుక’గా వర్ణించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తప్పుపట్టారు. ఒకవేళ అదే నిజమైతే తాము అధికారంలోకి రాకముందు 2014 వరకు బీజేపీ దీనిని ఎందుకు వ్యతిరేకించిందని ఆయన నిలదీసారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంవత్సర కాలంలో లక్షలాది మంది వ్యాపారులు, ఎగుమతిదారులు తమ డబ్బు ఇరుక్కుపోయి విలవిల్లాడుతున్నారని, సమయానికి వారి సొమ్ము వెనక్కిరాక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీఎస్టీని సమగ్రత విజయం, నిజాయితీ వేడుకగా అభివర్ణిస్తున్న కేంద్రం తాము అధికారంలోకి రాకముందు ఐదు సంవత్సరాలూ దానిని వ్యతిరేకిస్తూ వచ్చిందని అన్నారు. దీనికి సంబంధించిన వాస్తవ అంకెల వివరాలను, అందులోని లోపాలను వెల్లడించడానికి ఆర్థిక మంత్రి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఎంతకాలం తాత్కాలిక జిఎస్‌టిఆర్-3బి ఫారంతో ప్రభుత్వం నెట్టుకొస్తుందని, దానికి న్యాయపరంగా విలువ ఉందా అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీని సహకార సమాఖ్యగా చిదంబరం వర్ణించారు. ఫారం జిఎస్‌టిఆర్-2, జిఆర్‌టిఆర్-3ల గురించి సంవత్సరం తర్వాత ఎందుకు ప్రకటన చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాగా, జీఎస్టీ కింద నమోదైన ప్రతి వ్యాపారి జిఎస్‌టిఆర్ 3బి ఫారం పూర్తి చేసి ఇవ్వడం తప్పనిసరి. సిబిఇసి ద్వారా ప్రవేశపెట్టిన ఈ సింపుల్ టాక్స్ రిటర్న్ ఫారాన్ని వ్యాపారులు జూలై, ఆగస్టు నెలల్లో సమర్పించాలి. అలాగే జూలై, ఆగస్టులకు సంబంధించిన జిఎస్‌టిఆర్-1, జిఎస్‌టిఆర్-2, జిఎస్‌టఆర్-3 ఫారాలు సెప్టెంబర్‌లో సమర్పించాల్సి ఉంది.