జాతీయ వార్తలు

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పరస్పర ప్రయోజనాల ఆధారంగా సియాఛెల్లెస్‌కు చెందిన అసమ్షన్ ద్వీపంలో ఉమ్మడి నౌకాస్థావరం ఏర్పాటుపై ముందడుగు వేయాలని ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ అధ్యక్షుడు డాన్నీ ఫారేలు నిర్ణయించారు. అంతకు ముందు రెండు దేశాలు నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేయాలని ఒక అంగీకరానికి వచ్చాయి. అయితే దీన్ని రద్దు చేసుకోబోతున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరు నేతల మధ్య అరమరికలు లేకుండా జరిగిన చర్చల అనంతరం, సియాఛెల్లెస్‌కు 100 బిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. దేశ సైనిక వౌలికసదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ రుణం అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అసమ్షన్ ద్వీపంలో చేపట్టే ప్రాజెక్టుపై పరస్పర ప్రయోజనాల ఆధారంగా పనిచేయాలని నిర్ణయించామన్నారు. హిందూమహాసముద్రంలో ఉన్న అసమ్షన్ ద్వీపంలో నౌకాస్థావరాన్ని నెలకొల్పాలన్నది భారత్ సంకల్పం. ముఖ్యంగా తన సైనిక సంపత్తిని మరింతగా విస్తరిస్తూ దూకుడు పెంచుతున్న చైనాకు ముకుతాడు వేయడానికి భారత్‌కు వ్యూహాత్మకంగా అసమ్షన్ ద్వీపం ఎంతో కీలకం.
ఈ నేపథ్యంలోనే అసమ్షన్ ద్వీపాన్ని అభివృద్ధి పరచేందుకు వీలుగా 2015లో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.అయితే సియాఛెల్లెస్ ప్రతిపక్ష పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, ఫారే ‘తమ ద్వీపం స్వంతంగా సైనిక సదుపాయాలను పెంచుకుంటుందని, భారత్‌తో తలపెట్టిన ప్రాజెక్టు ఇక ముందుకెళ్లే సమస్యే లేదని’ ప్రకటించారు. నిజానికి ఫారే భారత్ పర్యటనకుముందే, భారత్‌తో ఉమ్మడి ప్రాజెక్టుపై ఎంతమాత్రం ముందడుగు పడబోదని విదేశాంగశాఖ వెల్లడించిందని అక్కడి మీడియా పేర్కొంది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సియాఛెల్లెస్ పార్లమెంట్ ఆమోదం తెలపదని, విదేశాంగశాఖ పేర్కొన్నట్టు మీడియా వార్తలు వెల్లడించాయి. ఇదిలావుండగా రెండో డోర్నియర్ యుద్ధవిమానాన్ని సియాఛెల్లెస్‌కు భారత్ బహుమతిగా ఇవ్వనున్నదని ప్రధాని ప్రకటించారు. జూన్ 29కి ముందే ఈ విమానం సియాఛల్లెస్‌కు చేరుతుందన్నారు. సియాఛెల్లెస్ సముద్ర వౌలిక సదుపాయాలు, రక్షణ సామర్ధ్యం వృద్ధి చేసేందుకు భారత్ కట్టుబడి ఉన్నదని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి.
చిత్రం..న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ డోర్నియర్ యుద్ధ విమానం నమూనాను
డాన్నీ ఫారేకు అందజేస్తున్న దృశ్యం