జాతీయ వార్తలు

మోదీకి ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధాని నరేంద్ర మోదీకి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మోదీకి ఎల్లవేళలా ముప్పు ఉందని కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖ హెచ్చరించిన దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. ప్రధానిని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) ఉంటోంది. ఇక నుంచి ప్రధానిని కలవాలంటే ఎస్‌పీజీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. మంత్రులు, అధికారులు ఎవరైనాసరే ఎస్‌పీజీ అనుమతి తీసుకోల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీకి ఎల్లవేళలా ముప్పు పొంచిఉందని, 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ ఆయనను టార్గెట్ చేసి ప్రమాదం ఉందని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ‘ఎవర్నీ చివరికి మంత్రులు, ఉన్నతాధికారులు ఇక ముందు ప్రధానిని నేరుగా వెళ్లి కలవడానికి వీలులేదు. ప్రత్యేక ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) అనుమతి ఇవ్వాల్సిందే’అని హోమ్‌శాఖ వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు సమాచారం అందచేసింది. మోదీకి గుర్తుతెలియని ముప్పు ఉందని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ప్రధానికి భద్రత కల్పిస్తున్న అన్ని దళాలను ఎస్‌పీజీ అప్రమత్తం చేసింది. దీన్లో భాగంగానే రోడ్‌షోలు, ర్యాలీలు తగ్గించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ భద్రత చూసే క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ (సీపీటీ) మరింత కఠినమైన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు
రూపొందించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. మోదీని కలవాలనుకునే మంత్రులు, అధికారులను తనిఖీ చేస్తారు. కాగా ప్రధానిని మావోయిస్టులు టార్గెట్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఈ నెల 7 నుంచి భద్రతపై పునఃసమీక్షించారు. దీనికి సంబంధించి తాము లేఖను స్వాధీనం చేసుకున్నామని పూణే పోలీసులు కోర్టుకు తెలిపారు. నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) గ్రూపు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హతమార్చినట్టే మోదీకి ముప్పు ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ వ్యక్తి ఆరుఅంచెల భద్రతను ఛేదించి మరీ ఆయన కాళ్లను పట్టుకున్నారు. ఈ రెండు ఉదంతాలను కేంద్ర హోమ్‌శాఖ తీవ్రంగా పరిగణించింది. కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇంటిలిజెన్స్, భద్రతా ఏజన్సీలతో సంప్రదించి ప్రధాని భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై హోమ్‌శాఖ సమీక్షించింది. మావోల ప్రభావం ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు.