జాతీయ వార్తలు

కేంద్రం సుముఖమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: తెలంగాణలోని బయ్యారం, ఆంధ్ర ప్రదేశ్‌లోని కడపలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకువ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ తమకు హామీ ఇచ్చారని ఏపీ బీజేపీ నాయకులు రఘునాధ బాబు, కందుల రాజమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తామీ రోజు ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, బీరేంద్రసింగ్‌ను కలిసి రెండు ఉక్కు కర్మాగారాల ఏర్పాటు గురించి చర్చించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు పంచుకుని తద్వారా తయారు చేసిన నివేదికను సమర్పించాలని ఉన్నదనేది మరిచిపోరాదని వారు తెలుగు దేశం ప్రభుత్వానికి సూచించారు. కడపతోపాటు విశాఖలో కూడా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని ఇరువురు నాయకులు చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు అనంతపురం ఇనుప రజను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఎంఓయు కుదుర్చుకున్నదని వారు తెలిపారు. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు చొరవ మూలంగానే 2016లో కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌లో ఆంధ్ర ప్రతినిధిని నియమించటం నిజం కాదా అని వారు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కడపకు వచ్చి ఉక్కు కర్మాగారానికి శంకు స్థాపన చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసునని మహేంద్ర బాబు తెలిపారు. కడప నేతలు రాజకీయ లబ్ధికోసమే నిరాహార దీక్షలు చేస్తున్నారంటూ వారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో ఆరు గంటల పాటు దీక్షలు చేయలేని నాయులు ఆరు రోజుల నుండి దీక్షలు ఎలా చేయగలుగుతున్నారనేది అర్థం కావటం లేదని వారు చెప్పారు. తెలుగు దేశం నాయకులవి నిజాయితీతో కూడిన దీక్షలు కావని వారు ధ్వజమెత్తారు. కేంద్రం కడపలో 300 మిలియన్ టన్నుల ఇనుమును ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తోందని రాజమోహన్ రెడ్డి చెప్పారు.