జాతీయ వార్తలు

ఉద్యోగులకు కేంద్రం షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం, ఒవర్‌టైమ్ అలవెన్స్‌ను కొంతమందికి మాత్రమే పరిమితం చేస్తూ, ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది శాఖ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఆపరేషనల్ ఉద్యోగులకు మాత్రమే ఓటీ అందుతుంది. ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పారిశ్రామిక ఉద్యోగులు, ఆపరేషనల్ సిబ్బందికి మినహాయించి మిగిలిన ఉద్యోగులకు ఓటీ చెల్లింపులు అవసరం లేదని ఏడో వేతన సంఘం సిఫారసు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్, యాంత్రిక పరికరాలపై పనిచేసేవారు, కార్యాలయం సక్రమంగా పనిచేయడానికి దోహద పడేవారికి ఓటీ వర్తిస్తుంది. ఈ మేరకు ఉద్యోగుల జాబితా తయారు చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ఇదే సమయంలో ఓటీని బయోమెట్రిక్ హాజరుతో అనుసంధానిస్తారు.