జాతీయ వార్తలు

విలువలు మంటగలిపారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబమే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. అత్యయిక పరిస్థితిని కాంగ్రెస్ చేసిన మహా పాపంగా అభివర్ణించిన ఆయన ఒకే కుటుంబం కోసం మొత్తం రాజ్యాంగానే్న దుర్వినియోగం చేశారని అన్నారు. ఎమర్జెన్సీ 43వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అనేక కోణాల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని కూడా తీవ్ర పదజాలంతో విమర్శించారు. తన ప్రభుత్వం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తోందన్న విమర్శల్ని కొట్టిపారేసిన మోదీ ‘అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదు’అని అన్నారు. దేశంలో అత్యంత ఘోరమైన రీతిలో ఎమర్జెన్సీని విధించడమే కాకుండా ఒకే కుటుంబం కోసం మొత్తం రాజ్యాంగానే్న భ్రష్టుపట్టించారని అన్నారు. ఆ కుటుంబ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మొత్తం భారత దేశమే కారాగారంగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు.బీజేపీ పాలనలో న్యాయ వ్యవస్థలో సంక్షోభం తలెత్తిందని, మీడియాపైనా దాడులు పెరిగాయన్న వాదనలనూ తిరస్కరించిన మోదీ ఎమర్జెన్సీ సమయంలో న్యాయమూర్తుల్ని భయపెట్టారని, న్యాయ వ్యవస్థనే దిగజార్చారని ఎదురుదాడి చేశారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కోసం పాటలు పాడనందుకు ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ పాటల్నే రేడియోలో ప్రసారం కాకుండా నిషేధించిన ఘనత ఆ పార్టీదని మోదీ అన్నారు.అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి రాతలూ రాయకుండా మీడియా గొంతునొక్కారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ అన్నది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఓ చీకటి రోజని, అది దాపురించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో బ్లాక్ డేను జరుపుకోవడంలో ఉద్దేశం కేవలం కాంగ్రెస్ పాపాన్ని ఎలుగెత్తి చాటడమే కాదని, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల భవిష్యత్ తరాలకు అవగాహన కలిగించడమేనని మోదీ తెలిపారు. అలాగే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించుకునే విషయంలో నేటి, భవిష్యత్ తరాలకు ఇది ఓ పాఠంగా పనికొస్తుందన్నారు. నిరంతర జాగరూకతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యమని పేర్కొన్న మోదీ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తుందని తెలిపారు.బీజేపీ హయాంలో దళితులు, మైనార్టీలు, రాజ్యాంగానికి రక్షణే లేదంటూ కాంగ్రెస్ నేతలు ఊహాజనిత ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తిన మోదీ ‘కాంగ్రెస్ ధోరణిలో నాటికి నేటికి ఎలాంటి మార్పు లేదు. స్వార్థం కోసం ఆ పార్టీ నేతలు సొంత పార్టీనే నాశనం చేసుకున్నారు. ఎమర్జెన్సీ విధించి దేశానే్న జైలుగా మార్చేశారు. నాటి మేటి నేతల్ని కటకటాల వెనక్కి నెట్టేశారు’అని అన్నారు. తాము అధికారాన్ని కోల్పోయినప్పుడల్లా దేశం సంక్షోభంలో పడిందని గుండెలు బాదుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనన్నారు.

చిత్రం..సాహు మహరాజ్ జయంతి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనపై ముద్రించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి బహూకరిస్తున్న బీజేపీ నేత ఆశిష్ షెలార్