జాతీయ వార్తలు

ముంబయిలో కూలిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 28: ముంబయిలో 12 సీటర్ల విమానం ఇళ్లపై కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గురువారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పైలెట్లు, ఇద్దరు మెయింటినెన్స్ ఇంజనీర్లు, ఒక పాదచారి చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఘట్కోపార్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు. రాష్ట్రంలో కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. నాసిక్ వద్ద హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ విమానం సుఖోయ్ సు-30 ఎం విమానం బుధవారం కుప్పకూలింది. కింగ్ ఎయిర్ సీ 90 అనే 12 సీటర్ల శిక్షణ విమానం జుహూ నుంచి టేకాఫ్ తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోంది. మధ్యాహ్నం 1.15కి విమానం కూలిపోయినట్టు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక వాహనాలు, వాటర్ ట్యాంకులను విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపుచేశాయి. కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. డీజీసీఏ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందినవెంటనే అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందిని అక్కడికి పంపినట్టు వారు తెలిపారు. మృతదేహాలను ఘట్కోపారలోని రాజ్‌వాడీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ దుర్ఘటనపై మంత్రి సురేష్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.