జాతీయ వార్తలు

ఎమర్జెన్సీపై అధికార విపక్షాల వాగ్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ఎమర్జెన్సీ విధింపు వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దారితీసింది. తాజాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై వామపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. అరుణ్ జైట్లీ తన ‘ఎమర్జెన్సీ రీవిజిటెడ్’ పేరుతో రాసిన వ్యాసం మూడోభాగంలో లెఫ్ట్‌పార్టీల వైఖరిని విమర్శించారు. ‘ రామ్‌మనోహర్ లోహియా అనుయాయులు దీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో అంటకాగడం విచిత్రం. ఇక సీపీఐ ఎమర్జెన్సీని సమర్థిస్తే, సీపీఎం సైద్ధాంతికంగా వ్యతిరేకించినా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దాని పాత్ర చాలా స్వల్పం. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రమే అరెస్టయ్యారు. పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, విద్యార్థి నేతలు ఎవరూ అరెస్ట్ కాలేదు’ అని జైట్లీ పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ (ఓ), సోషలిస్టు పార్టీలు, స్వతంత్ర పార్టీ, జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రమే అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహాలు, ఆందోళనలు నిర్వహించాయన్నారు. సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా అనుయాయులైన జార్జ్ ఫెర్నాండెజ్, మధు లిమాయే, రాజ్ నారాయణ్‌లు ఎప్పుడూ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. నేడు అదే సంప్రదాయాన్ని ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్‌లు అనుసరిస్తున్నారు. కానీ ములాయం సింగ్ యాదవ్ ఎల్లప్పుడూ కాంగ్రెస్‌తో అంటకాగుతుండటమే విచిత్రం. అ ని జైట్లీ విమర్శించారు. జైట్లీ విమర్శలపై సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇందిరాగాంధీకి మద్దతు పలుకుతూ, తమ కార్యకర్తలను విడుదలకోసం అభ్యర్థిస్తూ రాసిన లేఖలు చరిత్ర పుటల్లో ఇంకా స్పష్టంగా ఉన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సీపీఎం కార్యకర్తల త్యాగాలు చరిత్రలో ఇంకా నిలిచే ఉన్నాయన్నారు. ‘చరిత్రను వక్రీకరించడం వారి వృత్తి. ప్రజాస్వామ్య పునరుద్ధరణకోసం సీపీఎం కార్యకర్తల బలిదానాలు చరిత్రలో స్పష్టంగా లిఖించి ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమానికి మద్దతు ప్రకటించడం నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీల సంస్థాగత ఎమర్జెన్సీపై పోరాటం కొనసాగిస్తా’ అని ఏచూరి అన్నారు.