జాతీయ వార్తలు

ఇందిర ఓ మేరుపర్వతం : ఆనందర్‌శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓ మేరుపర్వతమని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ స్పష్టం చేశారు. కోట్లాది మంది భారతీయుల ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ ఓ నియంత అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శంపై శర్మ విరుచుపడ్డారు. ‘జైట్లీ వ్యాఖ్యలు అసంబద్ధం, దారుణం’ అని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. 1977లో ఎమర్జెన్సీ విధించడానికి గల కారణాలు ఇందిర విశే్లషించడంతోపాటు దానికి బాధపడ్డారని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకురాలని జర్మనీ నియంత హిట్లర్‌తో పోలుస్తారా అంటూ జైట్లీపై ధ్వజమెత్తారు. ‘బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ స్కూలు నుంచి వచ్చిన జైట్లీ ఫాసిస్ట్ నియంత్ర హిట్లర్‌ను స్తుతించడంలో తప్పులేదు’ అని ఆనంద్‌శర్మ ఎద్దేవా చేశారు. ‘అప్పట్లో ఇందిరా సమర్ధవంతమైన నాయకురాలు. ప్ర జాస్వామ్య పద్ధతుల్లో ప్రజల నుంచి ఎన్నికైన తిరుగులేని అధినేత్రి. ఇందిర శక్తి, సామర్థ్యాలకు ప్రపంచ దేశాలే అబ్బురపడ్డాయి’ అని శర్మ పే ర్కొన్నారు. అలాంటి నాయకురాలిని హిట్లర్‌తో పోల్చ డం జైట్లీ అహంకారాన్ని తెలియజేస్తుందని విరుచుకుపడ్డారు. నియంతలు ఎన్నికలకు వెళ్లారని ఆయన అంటూ జైట్లీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.