జాతీయ వార్తలు

ఇదిగో సాక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: పాకిస్తాన్‌పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఏన్డీయే ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నీలం లోయ, నేపా లోయలో జరిపిన మెరుపుదాడి వీడియోను అనధికారికంగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడి చేయటం తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్‌పీ, ఎస్‌పీ తదితర పార్టీలు మెరుపుదాడి జరగలేదంటూ అప్పట్లో విమర్శలు గుప్పించాయి. సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఉంటే ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేయాలని ఈ పార్టీలు డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి ఒక సదస్సులో మాట్లాడుతూ మెరుపుదాడి జరిగి ఉంటే వీడియో ఎక్కడున్నదని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ వెంటనే స్పందిస్తూ అరుణ్‌శౌరి లాంటి సీనియర్ నాయకుడే మెరుపుదాడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, మెరుపుదాడి జరగలేదన్న తమ వాదనను ఆయన బలపరిచారని వ్యాఖ్యానించింది. దీనితో మోదీ ప్రభుత్వం మెరుపుదాడికి సంబంధించిన ఎనిమిది నిమిషాల వీడియోను అనధికారికంగా విడుదల చేసి అందరి నోళ్లు మూయించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై జరిపిన దాడిలో 19 మంది భారత సైనికులు మరణించారు. అందుకు ప్రతీకారంగా భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు ఉగ్రవాదుల శిబిరాలపై చేసిన మెరుపు దాడిలో దాదాపు వంద మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఇరవై నుండి ముప్పయి మంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించారు. ఈ నాలుగు దాడులకు సంబంధించిన ఎనిమిది నిమిషాల వీడియోలో పలు అంశాలను స్పష్టం చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్రవాదుల గుంపులు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత సైనికులు జరిపిన దాడిలో ఉగ్రవాదుల శిబిరంలోని బంకర్లు, షెడ్డులు పేలిపోవటం కనిపించిది. గుంపులుగా నిలబడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కుప్పకూడలటం కూడా వీడియోలో కనిపించింది. ఉగ్రవాదుల శిబిరాలపై బాంబులు వేయటం కూడా స్పష్టంగా కనిపించిది. మొత్తం నాలుగు ప్రాంతాలను టార్గెట్ చేసి జరిపిన దాడులను వీడియోలో బంధించారు. భారత సైనికులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాలపై జరిపిన దాడులను ఉద్దంపూర్‌తోపాటు ఢిల్లీలోని సైనిక కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించారు. రక్షణ శాఖ, జాతీయ భద్రతా సంస్థ, ప్రధాన మంత్రి కార్యాలయం సీనియర్ అధికారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిపిన మెరుపుదాడిని ప్రత్యక్ష ప్రసారం పర్యవేక్షించారు. ఈ మెరుపు దాడిని అందులో పాల్గొన్న కమండోల హెల్మెట్లలో అమర్చిన యుఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియర్ వెహికిల్), ధర్మల్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు.