జాతీయ వార్తలు

అనుమతి ఇచ్చింది మీ శాఖే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: కాలనీల అభివృద్ధి పేరుతో నగరంలోని వేలాది చెట్లను కొట్టివేస్తున్నారంటూ కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఏడు కాలనీల్లో రాష్ట్ర ప్రభుత్వం 16,500 చెట్లు నరికివేయడానికి ప్రయత్నిస్తోందని మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. కాలనీల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖే ఆమోదం తెలిపిందన్న సౌరభ్ ‘వాస్తవాలు మరుగున పెట్టి ఆప్ సర్కార్‌పై బురద జల్లుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండానే ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఇవన్నీ పక్కన బెట్టేసి రాష్ట్ర ప్రభుత్వమే చెట్లు కొట్టివేయిస్తుందని మంత్రి హర్షవర్దన్ జనాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆప్ విమర్శించింది. తన మంత్రిత్వశాఖే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని మరుగున పెట్టి ఆప్ ప్రభుత్వంపై ఆరోపణల చేయడం దారుణమని ఆయన అన్నారు. పర్యావరణ శాఖ అధికారి వెబ్‌సైట్ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడా భూగర్భజలాల, జన సాంద్రత విషయాన్ని పరిగణలోకి తీసుకోలేద్న వాస్తవం పర్యావరణశాఖ నివేదిక చూస్తే స్పష్టమవుతుందని భరద్వాజ్ తెలిపారు.