జాతీయ వార్తలు

సర్జికల్ స్ట్రయక్స్‌పై బీజేపీ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్రవాదులపై జరిపిన సర్జికల్ స్ట్రైక్ వీడియోలను విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వం దానిని రాజకీయం చేస్తోందని, దేశం కోసం సైనికులు చిందించిన రక్తాన్ని, త్యాగాన్ని, ధైర్య సాహసాలను రాజకీయ ఓటు కోసం ఆయుధంగా మలచుకోవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు ఆర్మీ దాడి నుంచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం మరోవైపు పాకిస్తాన్‌తో వ్యవహరించే విషయంలో సైన్యానికి మార్గనిర్దేశం, విజన్‌ను కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆర్మీకి అవసరమైన పరికరాలు, ఆయుధ సామగ్రి సమకూర్చడం, బడ్జెట్‌ను కేటాయించడంలో మోదీ ప్రభుత్వం సవతి ప్రేమను కనబరుస్తోందని విమర్శించారు. సైనికుల త్యాగాలను ఓట్లు తెచ్చే ఆయుధంగా మోదీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్‌ను సంవత్సరం క్రితం జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ నిసిగ్గుగా ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందిందని ఆయన విమర్శించారు. మోదీ చేతకానితనం వల్ల సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ఇప్పటివరకు 1600 వరకు కాల్పుల ఉల్లంఘనలు జరిగాయని, 79సార్లు ఉగ్రవాద దాడులు జరిగాయని, 146 మంది మన సైనికులు కన్నుమూసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను ఇప్పుడు పెద్దయెత్తున ప్రచారం చేసిన బీజేపీ ప్రభుత్వం మన భద్రతా వ్యవస్థను, సైనికులను ప్రమాదంలో పడవేయడానికి నిర్ణయించుకుందా? అన్న విషయాన్ని జాతికి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
అప్పట్లో సర్జికల్ స్ట్రైక్‌లపై అర్థం లేని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విడుదలైన వీడియోలను పరిశీలించైనా తన తప్పును తెలుసుకోవాలని కేంద్ర మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం పారికర్ పేర్కొన్నారు కాంగ్రెస్ వారు ఇప్పటికైనా తమ తప్పును తెలుసుకోవాలి. సర్జికల్ స్ట్రైక్‌పై లేనిపోని సందేహాలను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు రక్షణ దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని పారికర్ విమర్శించారు.