జాతీయ వార్తలు

22 సీట్లు గెలుచుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురులియా, జూన్ 28: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నాడిక్కడ ఓ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్‌షా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తల తాగ్యాలు వృధా పోవని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాలు గెలుచుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ఆపడంతలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హింస పేట్రేగిపోతోందని, రాజకీయ ప్రత్యర్థులై తృణమూల్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఎందరో మహానుభావులను అందించిన పశ్చిమ బెంగాల్‌లో ఈనాడు ఈ పరిస్థితి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమేనని అమిత్‌షా ధ్వజమెత్తారు.‘హింసా సంస్కృతి బెంగాల్‌లో ఏనాడూ లేదు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, బకించంద్ర ఛటోపాధ్యాయ లాంటి మహనీయులు పుట్టిన గడ్డ. అలాంటి పశ్చిమ బెంగాల్ మమత హయాంలో ఏమైందో చూడండి’అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు బీజేపీ కార్యకర్తల కుటుంబాలను అమిత్‌షా పరామర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 22 స్థానాల్లో గెలిచితీరుతుందని షా ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ ప్రభుత్వం ఎంత హింసకు పాల్పడినా తాము మంచి ఫలితాలే సాధించామని బీజేపీ చీఫ్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 20 మంది బీజేపీ కార్యకర్తలును చంపేశారని ఆయన తెలిపారు. ‘ మా కార్యకర్తల త్యాగాలు వృధాగా పోవు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మమతా సర్కార్ కళ్లు తెరిపిస్తాం’అని ఆయన హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బాంబుల సంస్కృతిని తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పథకాలకు కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నా రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేకపోతోందని ఆయన విమర్శించారు.