జాతీయ వార్తలు

త్వరగా మూడో ఫ్రంట్ ఏర్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: కర్నాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బీజేపీ యేతర ఆరు పార్టీలు హాజరైన నేపథ్యంలో వీరంతా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తారని భావించడానికి వీల్లేదని జేడీ(ఎస్) అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి థర్డ్‌ఫ్రంట్ సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు కావాలని కూడా ఆయన సూచించారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరుగబోయే ముందస్తు ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నుంచి పార్టీ కేడర్‌కు స్పష్టమైన సూచనలు అందాయని ఆయన పేర్కొన్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన పార్టీలే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని గౌడ విలేకర్లతో అన్నారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఏర్పాటైన ప్యానల్ సమావేశంలో పాల్గొనేందుకు దేవెగౌడ ఇక్కడకు వచ్చారు. గతంలో జరగాల్సిన ఈ సమావేశం వాయిదాపడి గురువారం జరిగింది. గత నెలలో బెంగళూరులో జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి యునైటెడ్ ఫ్రంట్‌కు చెందిన కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, ఏఏపీ, సీపీఐ (ఎం), టీడీపీలకు చెందిన అగ్రనేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో చెరి 40 స్థానాల్లో పోటీచేసేందుకు వీలుగా సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. ‘కొన్ని సమస్యలున్నప్పటికీ కర్నాటకలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం’ అని స్పష్టం చేశారు.
‘కర్నాటక ప్రభుత్వ ఆయుఃప్రమాణం ఏడాది మాత్రమే’ అంటూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి దేవెగౌడ తిరస్కరించారు. ‘ అది ఆయన అభిప్రాయం మాత్రమే’ అని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 18, జేడీఎస్ 10 స్థానాల్లో పోటీ చేస్తాయన్న పుకార్లు వస్తున్నప్పటికీ, రెండు పార్టీల మధ్య ఇంకా అధికారికంగా సీట్ల ఒప్పందం కుదరలేదు.‘ఇప్పటి వరకు దీనిపై ఏవిధమైన చర్చలు జరగలేదు...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమారస్వామిలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని దేవెగౌడ అన్నారు.
తమ కూటమికి చెందిన బీఎస్‌పీకి కర్ణాటకలో ఒక లోక్‌సభ స్థానాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ పార్టీ ఉన్నదన్నారు. ఇందుకు బదులుగా ఉత్తరప్రదేశ్‌లో డానిష్ అలీ (జేడీ-ఎస్ ప్రదాన కార్యదర్శి)కి ఒక లోక్‌సభ స్థానం కేటాయించాలని అడుగుతామన్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్ తమకు ఒక స్థానం కేటాయిస్తుందన్నారు. త్వరలో ఎన్‌డీఏ యేతర పార్టీల నాయకులతో సమావేశమవుతామని దేవెగౌడ చెప్పారు. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలే చివరి సమావేశాలు కావచ్చునన్నారు.