జాతీయ వార్తలు

48 గంటల ముందు రాజకీయ ప్రకటనల పోస్టింగ్స్బంద్ చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 28: ఎన్నికల సమయంలో పోలింగ్‌కు 48 గంటలకు ముందు రాజకీయ పార్టీల ప్రచార ప్రకటనలను నిలిపివేసే విషయమై పరిశీలించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం వినతిని ఫేస్‌బుక్ పరిశీలిస్తోంది. కాని ఈ అంశంపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సామాజిక మాద్యమాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్న విషయం విదితమే. ఎన్నికల కోడ్‌ను ఫేస్‌బుక్‌కు కూడా వర్తింప చేయాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రకటనల అంశాన్ని చర్చించారు. ఈ సమావేశంలో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 126వ సెక్షన్‌పై చర్చించారు. ఈ సమావేశానికి ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ప్రతినిధి కూడా హాజరయ్యారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులను నమోదు చేసే సదుపాయాన్ని ఫేస్‌బుక్‌లో చేర్చాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తామని ఫేస్‌బుక్ పేర్కొంది. ప్రాతినిధ్య చట్టం కింద పోలింగ్‌కు 48 గంటల కంటే ముందు అన్ని ప్రచార సాధనాల్లో రాజకీయ పార్టీల ప్రకటన, ప్రసారంపై నిషేధం ఉంది.
ఫేస్‌బుక్‌లో రాజకీయ పార్టీల ప్రచార ప్రకటనలపై నిషేధం ఉంటే, ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని ఫేస్‌బుక్ ప్రతినిధి హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రకటనలు ప్రసారం కాకుండా చూస్తామన్నారు. ఎవరైనా ప్రకటనలను పోస్టు చేస్తే వాటిని తొలగిస్తామన్నారు. ప్రజల మధ్య అనుసంధానం కోసం నిర్దేశించిన ఫేస్‌బుక్‌ను నిర్వహించడం కత్తిమీద సవాలు అని కూడా ఆప్రతినిధి పేర్కొన్నారు. గ్లోబల్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రాతిపదికన తప్పనిసరిగా చట్టాన్ని ఉల్లంఘించే ప్రకటనలు ఉంటే తొలగిస్తామన్నారు.
ప్రతి దేశానికి ఉన్న చట్టాలను గౌరవించి అందుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ఈ విషయమై కమిటీ చైర్మన్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. ఫేస్‌బుక్ కూడా ఎన్నికల నిబంధనల గురించి తెలుసుకుని వ్యవహరించాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా ఫేస్‌బుక్ యూజర్స్‌లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కమిటీలో న్యూస్ బ్రాడ్ కాస్టర్స్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, , కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచారా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొన్నారు.