జాతీయ వార్తలు

పాక్‌ను సహించే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గ్ధామంగా మారింది. దీన్ని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదు. యుఎస్ ఇప్పటికే దీనిపై పాక్‌కు సందేశం పంపిందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ఒక పక్క తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్-యుఎస్‌లు ప్రపంచానికి నాయకత్వ వహించాలన్నారు. మతస్వేచ్ఛ చాలా అవసరమని, మనలాంటి దేశాలు పరస్పర సహనంతోనే మనుగడ సాగించాలన్నారు. చైనా ముఖ్యమే అయినప్పటికీ, ఈ ప్రాంతంలో విస్తరణకు చేస్తున్న యత్నాలు యుఎస్‌కు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. చైనా మాదిరిగానే చాలా దేశాలు ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదన్నారు. ఇటీవల సింగపూర్‌లోని షాంగ్రీ-లా చర్చల సందర్భంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్చాయుత నౌకారవాణా జరగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనిప్రాయం కూడా అదేనన్నారు. అణు సరఫరా గ్రూపులో భారత్ సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు. నిక్కీ హెలీ ఢిల్లీ లోని దేవాలయం, చర్చి, మసీదు, గురుద్వారాలను సందర్శించారు.

చిత్రం..న్యూఢిల్లీలోని జమా మసీద్‌ను గురువారం సందర్శించిన అమెరికా రాయబారి నిక్కీ హేలీ