జాతీయ వార్తలు

నల్లధనం ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: భారతీయులు స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు నల్ల ధనమా? తెల్ల ధనమా? అని శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నల్ల ధనమా? తెల్లధనమా? అంటూ ట్వీట్‌లో నిలదీశారు. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లపై నరేంద్ర మోదీ 2014 నుండి ఇంత వరకు చేసిన ట్వీట్ల గురించి రాహుల్ ప్రస్తావించారు. ‘స్విస్ బ్యాంకుల్లో ఉన్న మొత్తం నల్ల ధనాన్ని తెస్తాను అని, ప్రతి భారతీయుడు బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల చొప్పున డిపాజిట్ చేస్తానని మోదీ 2014లో చెప్పారన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నల్ల ధనం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందని 2016లో ప్రధాని చెప్పుకొచ్చారని రాహుల్ పేర్కొన్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు యాభై శాతం పెరిగాయి. ఇదంతా తెల్ల ధనమేనని నని 2018లో మోదీ తెలిపారని ఆయన తెలిపారు. అంటే స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా తెల్ల ధనమేనా? నల్ల ధనం అసలు లేనే లేదా?’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా, ఆర్థిక శాఖను తాత్కాలికంగా నిర్వహిస్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోల్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా నల్ల ధనం ఎలా అవుతుందని? ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దీనిపై స్పంది స్తూ మరి అలాంటప్పుడు 2014లో ప్రధాని మోదీ స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రతి భారతీయుడికి వారి ఖాతాలో పదిహేను లక్షల చొప్పున జమ చేస్తామని ఎలా చెప్పారని నిలదీశారు.