జాతీయ వార్తలు

స్విస్ సొమ్మంతా నల్లధనం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 29: స్విస్ బ్యాంకులో దాచుకున్నదంతా నల్లధనమని అనుకోవడానికి వీలులేదని, వచ్చే ఏడాది ఈ ఏడాది బ్యాంకులో భారతీయులు దాచుకున్న సొమ్ము వివరాలు తెలుస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2017 సంవత్సరంలో స్విస్‌బ్యాంకులో భారతీయులు దాచుకున్న సొమ్ము
అంతకు ముందు మూడు సంవత్సరాలతో పోల్చితే 50 శాతం పెరిగినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, అక్రమార్జన చేసి స్విస్‌బ్యాంకుకు ధనం తరలించినావారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది నల్లధనమా లేక అక్రమార్జనా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. మాకు మొత్తం సమాచారం వస్తుందని, తప్పిదాలకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. స్విస్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 2018 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సొమ్మును డిపాజిట్ చేసిన వారి వివరాలు బహిర్గతమవుతాయన్నారు. 2017లో భారతీయులు స్విస్ బ్యాంకులో రూ. 7వేల కోట్లను డిపాజిట్ చేశారని వార్తలు వచ్చాయి. కాగా ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికి తీస్తామని, స్విస్ బ్యాంకు ఖాతాల గట్టును రట్టు చేస్తామని మోదీ ప్రభుత్వం హామీలు గుప్పించిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. నల్లధనం వెలికితీతకు ప్రభుత్వం చేసిందేమీ లేదని కబుర్లు చెబుతోందని ప్రతిపక్షపార్టీల నేతలు విమర్శిస్తున్నారు. పెద్ద నోట్లరద్దు వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటని విపక్షాలు ప్రభుత్వాన్ని వివిధ సందర్భాల్లో నిలదీస్తున్న విషయం విదితమే.