జాతీయ వార్తలు

చట్టాలపై గౌరవం పెరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 29: దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు స్వచ్ఛందంగా రైల్వే పాస్ రాయితీలను వదులుకున్నారని, అలాగే 1.25 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీని ఏజన్సీలకు సరెండర్ చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో చట్టాలను గౌరవించే ధోరణి, సంస్కృతి, విధేయత పెరిగిందన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, ఇది గర్వించదగిన పరిణామమన్నారు. తాను ఎర్రకోట నుంచి నుంచి జాతిని ఉద్దేశించి ఇచ్చిన ఒక పిలుపుకు స్పందించి 1.25 కోట్ల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీని బెనిఫిట్‌ను వదులుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. రైల్వే పాస్‌ల రాయితీ విషయమై తాను ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ సీనియర్ సిటిజన్లు స్వచ్ఛందంగా రాయితీని వదులుకున్నారన్నారు. అర్హులైన వైద్యులు నెలకు ఒకసారి అయినా ఒక గర్భిణీ మహిళలకు ప్రసూతి వైద్య సేవలను ఉచితంగా అందించాలని తాను కోరానన్నారు. దీనికి స్పందించి వేలాది మంది డాక్టర్లు ముందుకు వచ్చారన్నారు. శుక్రవారం ఇక్కడ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో వృద్ధుల సంరక్షణకు ఏర్పాటు చేసిన జాతీయ కేంద్రానికి ఆయన శంకు స్థాపన చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ, అత్యవసర బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వమంటే ప్రజలకు ఉన్న విశ్వాసానికి పై సంఘటనలు నిదర్శనమన్నారు. ప్రజలకు తాము పన్నులు చెల్లిస్తున్నామనే స్పృహ పెరిగిందని, దేశాభివృద్ధి తమ వంతు పాత్ర నిర్వహించాలనే ఆకాంక్షకు ఇది నిదర్శనమన్నారు. త్వరలో దేశంలో అర్హులైన పేదలకు తక్కువ ఖర్చుతో జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పం సాకారమయ్యేందుకు గ్రామీణాభివృద్ధి, మంచినీరు, పారిశుద్ధ్యం, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్య శాఖలు ఒక వేదికపైకి వచ్చి అంకితభావంతో పనిచేస్తున్నాయన్నారు. దేశంలో 1,.5 లక్షల సెంటర్లను ఆరోగ్య, ఫిట్‌నెస్‌సెంటర్లుగా మారుస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ అనే స్కీం అమలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్షయ, కుష్టు వ్యాధితో పాటు బీపీ, చక్కెర, కేన్సర్ తదితర వ్యాధుల నివారణకు సమమ్రైన ఆరోగ్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో పది కోట్ల పేద కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల వైద్య సేవలు అందించే జాతీయ ఆరోగ్య బీమా స్కీంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పారు. పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మంచి వైద్యం అందించేందుకు వీలుగా ప్రణాళికను ఖరారు చేశామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వైద్య బీమా స్కీంను అమలు చేసే ఘనత భారత్‌కు దక్కుతుందన్నారు. 2025 నాటికి దేశం నుంచి క్షయ వ్యాధిని పారదోలుతామన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి జాతీయ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో 200 జనరల్ బెడ్స్, 20 మెడికల్ ఐసియూలు ఉంటాయి. ఈ సెంటర్‌ను రూ.330 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. 2020 ఫిబ్రవరి నాటికి ఈ సెంటర్ నిర్మాణం పూర్తవుతుంది.