జాతీయ వార్తలు

ఆ 40 మంది మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 29: ముంబయిలో నిర్మాణంలో ఉన్నభవనంపై విమానం కూలిన ఘటన నుంచి 40 మంది కార్మికులు తృటిలో మృతువు వొడిలోకి వెళ్లకుండా తప్పించుకున్నారు. ఈ విమానం మరి కొన్ని నిమిషాల్లో నిర్మాణ ప్రదేశంలో కూలుతుందనగా, వీరు భోజనం సమయం కావడంతో బయటకు వచ్చారు. ముంబయిలో నివాస ప్రాంతం ఘట్కాపార్‌లో విమానం కూలిన సంఘటన విదితమే. ఈ సంఘటనలో నలుగురు విమాన సిబ్బంది, ఒక పాదచారి మరణించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. విమానం కూలడానికి కొన్ని నిమిషాలకు ముందు భవన నిర్మాణ కార్మికులు లంచ్ వేళ కావడంతో బయటకు వచ్చారు. ఒక వేళ వీరంతా అక్కడే ఉండి ఉంటే మరణించి ఉండేవారని పోలీసులు చెప్పారు. అప్పటికీ ఈ ఘటనలో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నుంచి బయట పడిన కార్మికుడు నరేష్ నిషాద్ మాట్లడుతూ భగవంతుడి దయం వల్ల సురక్షితంగా బయటపడ్డామన్నారు. విమానం ఎలా పడిందో చూడలేదని, కాని తాము చూసే సరికి మండుతున్న శకలాలు కనపడ్డాయన్నారు. ఆ సమయంలో చిరు జల్లులు పడుతున్నాయని, అందుకే తాము వేరే స్థలంలో కూర్చుని భోజనం చేస్తున్నామని మరో కార్మికుడు చెప్పారు.
అలహాబాద్ నుంచి జీవనోపాధి నిమిత్తం వచ్చిన లవకుశ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. అదృష్టం వల్ల బతికి బట్టకట్టానని, నిర్మాణ భవనం వద్ద తాను లేనని చెప్పాడు. సమీపంలోనే ఎతె్తైన భవనాలు ఉన్నాయి. వాటిపైన పడకుండా నిర్మాణంలో ఉన్న భవనంపై పడడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని కార్మికులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఈ విమాన యువై ఏవియేషన్ కొనుగోలు చేసింది. జూహూ ఎయిర్ స్ట్రిప్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ విమానం ప్రమాదానికి లోనైంది.

చిత్రం..విమానం కూలిన ప్రదేశ్ ఇదే