జాతీయ వార్తలు

ఆజాద్‌పై దేశద్రోహం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ఆర్మీని అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌పై ఢిల్లీ కోర్టులో దేశద్రోహం పిటిషన్ దాఖలైంది. శశిభూషణ్ అనే న్యాయవాది పాటియాల హౌస్ కోర్టులో ఈ పిటిషన్ వేశారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజాద్, సైఫుద్దీన్‌పై క్రిమినల్ కేసు పెట్టినట్టు పిటిషనర్ వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌లో సైన్యం చేతుల్లో ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారని ఆయన ఆరోపించారు. సైనికుల దాడుల్లో ఉగ్రవాదులకంటే జనమే ఎక్కువ మంది మరణిస్తున్నారన్న ప్రకటన దుమారం రేపింది. ఆజాద్‌పై ఐపీసీలోని 124(రాజ్యద్రోహం), 120బీ(నేరపూరిత కుట్ర), 505(1)(సైన్యం/నేవీ/ఎయిర్‌ఫోర్స్ అధికారులపై వదంతుల వ్యాప్తి) కింద చర్యలు తీసుకోవాలని భూషణ్ కోర్టును అభ్యర్థించారు. ఆజాద్ వ్యాఖ్యలు సైనికుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాద్, సోజ్‌పై దాఖలైన పిటిషన్ శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 22న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఆజాద్ ‘జమ్మూకాశ్మీర్‌లో సైనిక కార్యకలాపాల్లో ఉగ్రవాదులంటే అమాయక ప్రజలే ఎక్కువ మంది చనిపోతున్నారు’అని అన్నారు. అలాగే జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రకటన చేశారని ఫిర్యాదు చేశారు. మరో కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ గత వారం మీడియాతో మాట్లాడుతూ ‘కాశ్మీర్‌కు స్వాతంత్య్ర అన్న అసాధ్యం. అన్ని వర్గాలు కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’అని స్పష్టం చేశారు. అయితే మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని సోజ్ తరువాత ఆరోపించారు. పాక్ మాజీ నియంత ముషారఫ్ ప్రతిపాదించిన కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి తాను అనుకూలంగా మాట్లాడినట్టు ఆయన విమర్శించారు. కాగా సైఫుద్దీన్ సోజ్ పుస్తకం ‘కాశ్మీర్-గ్లిమ్‌సెస్ ఆఫ్ హిస్టరీ, అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ ఆవిష్కరణకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క జైరాం రమేష్ తప్ప ఎవరూ హాజరుకాలేదు. వల్లభాయ్ పటేల్ కాశ్మీర్‌ను పాక్ తొలి ప్రధాని లిఖౌత్ అలీ ఖాన్‌కు ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారని సొజ్ పేర్కొన్నారు. పటేల్ ఆచరణాత్మక నాయకుడని, పొరుగుదేశంలో యుద్ధాన్ని కోరుకోలేదని సైఫుద్దీన్ స్పష్టం చేశారు.