జాతీయ వార్తలు

కాంగ్రెస్, జేడీఎస్‌పై అసంతృప్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 29: కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని, ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ప్రభుత్వం పనితీరుపై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం పనితీరుపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు లీకయ్యాయి. ఈ వివాదంపై ఆయన మొదటిసారిగా పెదవి విప్పారు. సరదాగా మాట్లాడిన మాటలను రికార్డు చేసి వీడియో క్లిప్పింగ్‌లను విడుదల చేయడం అనైతికమన్నారు. ఈ సందర్భంలో ఏమి చెప్పాననే విషయమై తెలియకుండా తన వ్యాఖ్యలను వివాదస్పదం చేశారన్నారు. ఇంత కంటే అనైతికమైన చర్యలు మరొకటి ఉండవన్నారు. శుక్రవారం ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం అనుసరించాల్సిన విధి విధానాలు, కనీస ఉమ్మడి అజెండా రూపకల్పనపై కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ, మతతత్వ బీజేపిని దూరంగా పెట్టేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నారు. ‘ నేను ప్రభుత్వం పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు మీడియాకు ఎవరు చెప్పారు. ఊహాజనితమైన వార్తలు రాస్తున్నారు’ అని సిద్ధరామయ్య ఆన్నారు. ధర్మశాల వద్ద ఆసుపత్రిలో 12 రోజుల పాటు ఆయన చికిత్స పొంది గత రాత్రి బెంగళూరుకు వచ్చారు. ధర్మశాలలో ఉండగానే సిద్ధరామయ్య ప్రభుత్వ మనుగడపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తలోరకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాదికి మళ్లీ బడ్జెట్ అవసరమని లేదని సిద్ధరామయ్య చెప్పినట్లు వీడియో క్లిప్పింగ్‌ల్లో ఉంది. గత ప్రభుత్వంలో సిద్ధరామయ్య ఆర్థిక శాఖ పోర్ట్ఫులియోను తన వద్దనే ఉంచుకున్నారు. కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఆర్థిక శాఖ పోర్ట్ఫులియోను ఎవరికీ కేటాయించకుండా తన వద్దనే ఉంచుకున్నారు.