జాతీయ వార్తలు

స్విస్ నల్లధనంపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 29: దేశంలో కార్పోరేట్ రంగానికి చెందిన పెద్దలు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయడంతో, లక్షల కోట్ల సొమ్ము స్విస్ బ్యాంకుకు తరలి వెళ్లిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రంపై ధ్వజమెత్తారు. స్విస్ బ్యాంకులో 50 శాతం మేర భారతీయులు దాచుకున్న నగదు నిల్వలు 2017లో పెరిగాయని, నల్లధనంపై ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. స్విస్‌బ్యాంకులకు నల్లధనం తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేస్తే నల్లధనం భరతం పడుతామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. 2017లో స్విస్ బ్యాంకులో రూ.7వేల కోట్లు నగదును భారతీయులు దాచుకున్నారంటే ఇదంతా నల్లధనమేన్నారు. ఈ వివరాలను స్విస్ బ్యాంకు స్వయంగా వెల్లడించిందని ఆయన ట్వీట్ చేశారు. నల్లధనాన్ని రాబట్టి ప్రతి పేదవాడి ఖాతాకు రూ.15 లక్షల సొమ్మును జమ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ స్విస్ ఖాతాల వివరాలపై ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. నల్లధనం ఏరులై పారుతోందని, కేంద్రం మాత్రం వౌనంగా ఉందన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు దండుకుని, ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థను దగా చేస్తున్న శక్తుల పట్ల ప్రధాని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. స్విస్ బ్యాంకు ఖాతాల్లో భారతీయులు రూ.7వేల కోట్ల నగదును గత ఏడాది దాచుకున్నారని, ఈ వివరాలను ఆ బ్యాంకు స్వయంగా వెల్లడించిందన్నారు.