జాతీయ వార్తలు

పెరిగిన సబ్సిడీ వంట గ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.2.71 పైసలను పెంచినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయ. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో వంట గ్యాస్ ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అంతకు ముందు నెల విదేశీ మారక ద్రవ్యం రేటు, సగటు బెంచిమార్కును పరిగణనలోకి తీసుకుని వంటగ్యాస్ ధరలను చమురు కంపెనీలు ఖరారు చేస్తాయి. దేశీయ సబ్సిడీయేతర ఎల్‌పీజీపై వస్తు సేవా పన్ను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వంటగ్యాస్ ధరలను సమీక్షించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు భగ్గుమనడంతో ఢిల్లీలో సబ్సిడీలేని ఎల్‌పీజీ ధర సిలిండర్‌కు రూ.55.50 పైసలు పెరిగింది. పెరిగిన ధరల మధ్య వ్యత్యాసం రూ.52.79 పైసలను కస్టమర్ బ్యాంకులో జమ చేస్తారు. దీనివల్ల బ్యాంకులకు జమయ్యే సబ్సిడీ సొమ్ము బదలాయింపు రూ.204.74 నుంచి రూ. 257.74కు పెరుగుతుంది.