జాతీయ వార్తలు

విక్టోరియన్ గోతిక్, ఆర్ట్‌డీకో భవనాలకు యునెస్కో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, జూన్ 30: భారతదేశంలో వారసత్వ కట్టడాలుగా ప్రసిద్ధిగాంచిన ముంబయిలోని విక్టోరియన్ గోతిక్, ఆర్ట్‌డీకో భవనాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించాయి. ఇది భారతదేశానికి నిజంగా సంతోషకరమైన వార్తేనని కేంద్రం వ్యాఖ్యానించింది. దేశానికి ఇలాంటి గుర్తింపు లభించడం ఇది మూడోసారి. గతంలో ఎలిఫెంటా కేవ్స్, ప్రస్తుతం శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్‌గా మార్చిన విక్టోరియా టెర్మినస్‌లకు 1987, 2004లో యునెస్కో గుర్తింపు లభించింది. ఈ రెండు భవనాలు అద్భుతమైన కౌశల్యంతో నిర్మించారని, ఇవి దేశ వారసత్వ కళాసంపదకు నిదర్శనాలని యునెస్కో వ్యాఖ్యానించింది. కాగా, ఈ కట్టడాలకు యునెస్కో గుర్తింపుతో ముంబయిని కళాసాంస్కృతిక విభాగంలో అంతర్జాతీయ స్థాయి స్థాయి ఏర్పడిందని నగరానికి చెందిన ఆర్కిటెక్ట్ లంబా వ్యాఖ్యానించారు. ఇది గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్టు కూడా ఇదే గుర్తింపును పొందాల్సి ఉందన్నారు. కాగా, కేంద్ర సాంస్కృతిక శాఖ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఈ రెండు కట్టడాల గుర్తింపుతో భారత్‌లో వారసత్వ ప్రదేశాల సంఖ్య 37కు చేరిందని పేర్కొంది. ముంబయి, దేశప్రజలకు ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ అభినందనలు తెలిపారు. మన కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో ఆర్థిక అంశాలపై అనేకవిధాలుగా ప్రభావం పడుతుందని అన్నారు. దేశ, అంతర్జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తుందని, తద్వారా ఉపాధి కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.

చిత్రం..విక్టోరియన్ గోతిక్