జాతీయ వార్తలు

దీవుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: భారత్ పరిధిలోని దీవుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ ప్రభుత్వ శాఖలను, నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. శనివారం ఇక్కడ 26 దీవుల సంపూర్ణ్భావృద్ధిపై చేపట్టనున్న ప్రణాళిక వివరాలను నీతి ఆయోగ్ అధికారులు వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. వౌలిక సదుపాయాలు, డిజిటల్ అనుసంధానం, గ్రీన్ ఎనర్జీ, వ్యర్థ పదార్థాల యాజమాన్యం, మత్స్య సంపద అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవుల అభివృద్ధికి సత్వరమే చర్యలు తీసుకోవాలనికోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ దీవుల్లో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలన్నారు. దీనికోసం సౌర విద్యుత్ రంగాన్ని పెద్ద ఎత్తున నెలకొల్పాలన్నారు. కాగా అండమాన్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకే సందర్శకులను అనుమతిస్తారు. మిగిలిన ప్రాంతాల్లోకి అనుమతించరు. అక్కడ ఆంక్షలను మొదటి నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలను ఎత్తివేస్తే విదేశీ, దేశీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ దీవులకు ఆగ్నేయాసియా దేశాల మధ్య మంచి అనుసంధానం ఉందన్నారు.
ఇక్కడ వౌలిక సదుపాయాలను నెలకొల్పితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ రెండు దీవుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేసే పంటల గురించి ప్రణాళికను ఖరారు చేయాలన్నారు. భారత్ పరిధిలోని 26 దీవుల అభివృద్ధి కోసం దీవుల అభివృద్ధి ఏజన్సీని 2017 జూన్ 1వ తేదీన కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవుల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇతర అధికారులు హాజరయ్యారు.