జాతీయ వార్తలు

భారత్ విశిష్టత చాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: దౌత్యవేత్తలు, రాయబారులు ప్రభుత్వానికి కాకుండా, దేశంలోని 1.3 బిలియన్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఎక్కడికెళ్లినా మాతృభూమి గొప్పతనాన్ని మరవకుండా భారత్ విశిష్టతను ప్రచారం చేయాలన్నారు. దౌత్య రంగంలో నైపుణ్యం సాధించేందుకు దౌత్యవేత్తలు కృషి చేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా దౌత్య రంగంలో సమూలాత్మకమైన, వ్యూహాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఆయన అన్నరు.
శనివారం ఇక్కడ రాష్టప్రతి భవన్‌లో దౌత్యవేత్తల వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం, హింస ప్రపంచంలోని అన్ని సమాజాలకు ముప్పుగా పరిణమించిందన్నారు. ఈ సవాళ్లను అధిగమించి భారత్ ముందుకు నడవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, బహుళ సంస్కృతులకు నిలయమైన భారత్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన కోరారు. ఐదు సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన భారత్ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. దేశీయంగా మనం సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచదేశాలకు తెలియచేయాలన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, స్టార్టప్ ఇండియా లాంటి బృహత్తర పథకాలను తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల్లోని పారిశ్రామికవేత్తలకు తెలియచేయాలన్నారు. ప్రపంచదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాలన్నారు. మన దేశ విశిష్ట నాగరికత, ఘన చరిత్ర, సాధించిన అభివృద్ధిని ఆయాదేశాలకు తెలియచేయాల్సిన నైతిక బాధ్యత రాయబారులపై ఉందన్నారు. భారత దేశ దౌత్యనీతిని ప్రపంచానికి తెలియచేయడంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో సుష్మాస్వరాజ్ తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుని, దౌత్యరంగానికి సమర్థమైన మార్గదర్శకాన్ని అదిస్తున్నారన్నారు. మన లక్ష్యాలను ప్రపంచానికి చేరవేసే బాధ్యత రాయబారులదేనని ఆయన చెప్పారు. మన దేశం ప్రారంభించిన ఈ-వీసా స్కీం ప్రపంచ దేశాల ఆదరణ పొందిందన్నారు.