జాతీయ వార్తలు

సీఎంబీపై అప్పీల్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 30: కావేరీ జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేనెజ్‌మెంట్ బోర్డును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు, కర్నాటక, పుదుచ్ఛేరి, కేరళకు జలాల పంపిణీకి సంబంధించి ‘కావేరీ యాజమాన్య బోర్డు’ను ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే కేంద్రం బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి నోటీఫికేషన్ విడుదలయింది. అయితే బోర్డుపై అప్పీలు చేయాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. నీటి పంపిణీ వివాదం పరిష్కారానికి ‘కావేరీ యాజమాన్య బోర్డు’ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ శనివారం ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ అప్పీలు విషయాన్ని వెల్లడించారు. కోర్టు ఆదేశాలు కర్నాటక రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం కాపాడేవి కాదని ఆయన తెగేసి చెప్పారు.‘ సుప్రీం కోర్టు తీర్పువల్ల కర్నాటకు ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే కేఎంబీని సవాల్ చేయనున్నాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. అందుకే కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేయదలిచాం’అని శివకుమార్ వెల్లడించారు. ఇలా ఉండగా జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు లోబడే పనిచేస్తుందని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. రెండు మూడు ప్రధాన సమస్యలపై తామిద్దరం కలిసే పోరాడతామని ఆయన ప్రకటించారు. కొన్ని పథకాలు అశాస్ర్తియంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తప్పుపట్టారు.‘మా ప్రభుత్వం రాజ్యాంగ నియమ, నిబంధల ప్రకారమే నడుచుకుంటుంది. సుప్రీం కోర్టు తీర్పులు, ఆదేశాల పట్ల మాకెంతో గౌరవం ఉంది. అయితే రెండు మూడు సమస్యలు కర్నాటకకు నష్టం చేసేవిగా ఉన్నాయి. వాటిపై పోరాడతాం’అని కుమారస్వామి వెల్లడించారు.
కర్నాటక-తమిళనాడు, కేరళ-పుదుచ్ఛేరి రాష్ట్రాల నీటి వాటాలపై ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం గత మే నెలలో ఒక డ్రాప్టు ప్రతిపాదించింది. ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది.