జాతీయ వార్తలు

కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు మధ్యవర్తిత్వమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, జూన్ 30: మధ్యవర్తిత్వం, సంప్రదింపుల ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించే విధానం మంచిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ హిమాచల్‌ప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ స్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, దీని వల్ల న్యాయం సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా అనేక కేసులను పరిష్కరించవచ్చని, దీనివల్ల దేశంలో పేరుకుపోతున్న కేసుల సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. కొత్తగా కోర్టులను నెలకొల్పాలని సూచించారు. అలాగే పెద్ద ఎత్తున న్యాయాధికారులను, న్యాయమూర్తులను నియమించాలన్నారు. దేశంలో ఈ రోజు 2.75 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఈ వివరాలను నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ పొందుపరిచిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జ్యుడీషియల్ అకాడమిని ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. కేసుల పరిష్కారానికి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా అవతరించేందుకు ఈ అకాడమి కృషిచేయాలన్నారు. న్యాయాధికారులకు ఆధునిక అంశాలపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలన్నారు. న్యాయాధికారులు తాము చేస్తున్న వృత్తికి నైతికంగా, న్యాయపరంగా, ఉద్వేగభరితంగా అంకిత భావంతో పనిచేయాలన్నారు. న్యాయవాదులకు కూడా వివిధ తీర్పులు, చట్టాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. సామాజికంగా సున్నితమైన అంశాలపై నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వాలని ఆయన న్యాయాధికారులను కోరారు. జస్టిస్ జోసెఫ్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతిపై వెళ్లే ముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పనిచేశారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి తొలి దశ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన విభాగాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. న్యాయవ్యవస్థంటే తమకు అపారమైన గౌరవం, నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు.