జాతీయ వార్తలు

గ్రే లిస్టులో పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: హవాలా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణపై ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించి ఫైనాన్షియల్ ఏక్షన్ టాస్క్ఫోర్సు (ఎఫ్‌ఎటీఎఫ్) పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు పాల్పడటంపై అంతర్జాతీయంగా వస్తున్న నిరసనల నుంచి బయటపడటానికి ఆ దేశం ఇకనైనా టెర్రరిజం నిర్మూలించే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో ఎఫ్‌ఎటీఎఫ్ అంతర్జాతీయ కాపలాదారుగా వ్యవహరించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 2008 ముంబయి దాడితో సహా భారత్‌పై పాక్ చేసిన వరుస దాడులకు బాధ్యులను చేయాలని మానవ వనరుల శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ డిమాండ్ చేశారు. టెర్రరిజం ప్రోత్సాహంపై నిరసన వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ ఉన్నతస్థాయిలో సమావేశం నిర్వహించి హామీ ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్‌తో పాటు లష్కర్ ఇ తోయిబా, జైషే ఇ మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహించకుండా చూస్తామని వాగ్దానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, వారికి ఆర్థికంగా నిధులు అందించడం వంటి చర్యలకు పాల్పడుతున్న పాక్‌ను గ్రే లిస్టులో పెడుతూ ఎఫ్‌ఎటిఎఫ్ పారిస్‌లో జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల తర్వాత దీనికి సంబంధించి సమీక్ష చేస్తారు.