జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో హతమైంది ఒక ఉగ్రవాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 30: కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సంఘటన ప్రదేశం నుంచి ఇంతవరకు ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఘటనలో హతమయ్యారని భావించిన మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉంటారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. హతుడైన ఉగ్రవాదా లష్కర్ తోయిబాకు చెందిన సజాద్ అహ్మద్ షా అని పోలీసులు గుర్తించారు. ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన చౌగల్ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు. రైఫిల్, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమనా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు హుటావుటిన చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి ఆపరేషన్ నిర్వహించారు. ఈ వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్‌పీ వైద్ చెప్పారు. కాగా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారంతో డీజీపీ భద్రతా బలగాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురుహతమైనట్లు భావించామని, కాని సోదాలు నిర్వహించిన తర్వాత ఒక మృతదేహం మాత్రమే లభించిందని డీజీపీ చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను ఉధృతం చేసినట్లు డీజీపీ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక స్థానిక యువకుడు కూడా మరణించిన విషయం విదితమే.