జాతీయ వార్తలు

జగన్నాథుడికి వంద రథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 3: పూరీ జగన్నాథుడి వార్షిక రథయాత్ర కార్యక్రమం నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నాడు. పూరీ సముద్రతీరంలో మొత్తం వంద ఇసుక రథాలను రూపొందిస్తున్నారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలతో కలిసి మూడు అత్యున్నతమైన రథాలపై ప్రతి ఏటా తొమ్మిది రోజులపాటు ఊరేగడం తెలిసిందే. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో పూరీ సాగరతీరంలో ఇసుక రథాల సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సుదర్శన్ పట్నాయక్ ఆదివారం అన్నారు. ‘మా సంస్థలోని 25మంది విద్యార్థులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నుంచి నేను ఈ పనిని ప్రారంభించాం. రేపు సాయంత్రానికి (జూలై 4) వంద రథాల రూపకల్పన పూర్తవుతుంది’ అని పట్నాయక్ వెల్లడించారు. జూలై ఆరునుంచి పూరీ జగన్నాథుడి రథయాత్ర మొదలవుతుంది. ఇప్పటికే 50కి పైగా రథాలను పూర్తి చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో దీనికి చోటు లభిస్తుందని పట్నాయక్ అన్నారు.

చిత్రాలు.. అహ్మదాబాద్‌లో ఆదివారం నిర్వహించిన అమృత ఉత్సవంలో భాగంగా జగన్నాథుని అభిషేకించేందుకు సిద్ధం చేసిన లక్షా 25వేల మామిడిపండ్లు.
స్వామి ఆలయం వద్ద మోహరించిన పారా మిలటరీ దళాలు