జాతీయ వార్తలు

జాతీయ రాజకీయాల్లో ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరావుతో శనివారం రాత్రి జరపాల్సిన భేటీ రద్దయింది. సాంకేతిక కారణాలతోనే దేవెగౌడ హైదరాబాద్ చేరుకోవడం ఆలస్యమైందని ఒక వర్గం చెబుతుండగా, రాజకీయ అజెండాపై స్పష్టత లేకనే సీఎం కేసీఆర్‌తో భేటీ రద్దయిందని, ఇందుకు రాజకీయాలే కారణమని మరో వర్గం చెబుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఆదివారం ఉదయం సమావేశమవుతారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నా అదీ అనుమానమేనని అంటున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో భేటీకి సంబంధించి ఆ పార్టీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ భేటీ వాస్తవానికి శనివారం సాయంత్రమే జరగాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక హైదరాబాద్ చేరుకోవడంలో జాప్యం జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో భేటీ కావాల్సి ఉంది. వీటీ జేయుఐ ఛాలెండర్ -350 ప్రత్యేక విమానంలో ఆయన సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని 6.30కి సీఎంతో భేటీ కావల్సి ఉంది. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి మనుమడు అనిరుధ్ వివాహ సంగీత్ కార్యక్రమంలో పాల్గొని శనివారం రాత్రి పార్క్ హయత్‌లో బస ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆదివారం ఉదయం హెచ్‌ఐసిసిలో సుబ్బిరామిరెడ్డి మనుమడి వివాహం జరగనుంది. ఈ వివాహ కార్యక్రమంలో మాజీ ప్రధాని పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్తారు. అయితే ఈ షెడ్యూలులో స్వల్ప మార్పులు ఉన్నట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆదివారం ఉదయం భేటీ జరిగితే సమాఖ్య కూటమి ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వారిద్దరూ కీలకంగా చర్చించనున్నారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే ప్రధాన అజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవెగౌడతో సమావేశమయ్యారు. అంతకుముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అయితే ఇటు దేవెగౌడ, అటు మమతాబెనర్జీ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతుండటం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్నాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే జడ్ ప్లస్ భద్రతా సిబ్బంది నగరానికి చేరుకున్నారు.
ఇటీవల బెంగళూరులో భేటీ అయన కేసీఆర్, దేవెగౌడ (ఫైల్ ఫొటో)