జాతీయ వార్తలు

ఢిల్లీలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఒక ఇంట్లో 11 మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుదిపేసింది. వీరిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరణించిన ఏడుగురు మహిళల్లో నలుగురు బాలికలు ఉన్నారు. వీరి మృతదేహాలు హాల్‌లోని ఐరన్ గ్రిల్‌కు వేలాడుతున్నాయని, కొందరి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయని, మరి కొందరి చేతులు వెనక్కు కట్టేసి ఉన్నాయని పోలీసులు చెప్పారు. బురారిలోని సంత్ నగర్‌ప్రాంతంలో
మూడు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఈ దారుణం చోటు చేసుకుంది. మరణించిన వారిలో తొమ్మిది మంది మృతదేహాలు హాల్‌లోని ఐరన్ గ్రిల్‌కు వేలాడి ఉన్నాయి. వీరి కళ్లకు పత్తి పెట్టి గంతలు కట్టి ఉందని పోలీసులు చెప్పారు. అదే గదిలో ఒక వృద్ధ మహిళ మృతదేహం తలుపు ఫ్రేమ్‌కు వేలాడి ఉంది. వయోభారంతో ఉన్న మరో మహిళ మృతదేహం హాల్‌లో నేలపై పడి ఉంది. ఆమె కళ్లకు కూడా గంతలు గట్టి ఉన్నాయి. ఈ ఇల్లు ప్లైవుడ్ బిజినెస్ చేసే ఒక వ్యాపారికి చెందినదని పోలీసులు చెప్పారు. అతను కూడా ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. మరణించిన ఈ వ్యాపారి ప్రతి రోజూ ఇంటిపక్కన ఉన్న ఒక వ్యక్తితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లేవాడు. ఎప్పటిలాగానే పక్కంటి వ్యక్తి ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. తలుపులు తెరిచి ఉన్నాయి. హాల్‌లో మృతదేహాలు వేలాడి ఉన్న దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడ గుమిగూడారు.
మృతి చెందిన వారిలో 40 ఏళ్ల తన చెల్లెలు తీనా చౌదావత్ ఉన్నట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన కిరాణా వ్యాపారి మహేష్ ప్రతాప్ సింగ్ రాథోర్ గుర్తించాడు. ఇవి ఆత్మహత్యలు కావని, హత్యలేనని పోలీసులకు చెప్పారు. తన సోదరి తీనా 2002లో లలిత్ సింగ్‌ను వివాహమాడిన తర్వాత ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. మృతులకు చెందిన మరో బంధువు అర్జున్ తుంక్రాల్ తనకు సమాచారం తెలిసిన వెంటనే ఘటనా ప్రదేశానికి వచ్చానన్నారు. ఈ ఘటనపై సీసీటీవీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కుటుంబం గురించి తెలిసిన వారిని ప్రశ్నిస్తున్నారు. సంఘటన ప్రదేశాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు మనోజ్ తివారీ సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించినట్లు అదనపు డీసీపీ వినీత్ కుమార్ చెప్పారు. అన్ని కోణాల్లోంచి కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చిత్రం..మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్న దృశ్యం