జాతీయ వార్తలు

భాషలందు మాతృభాష వేరయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని మాతృ భాషలున్నాయో తెలుసా? జనాభా గణాంకాల విశే్లషణ ప్రకారం 121 కోట్ల జనాభా గల మన దేశంలో కనీసం పదివేల మంది మాట్లాడే భాషల సంఖ్య 121 అని ఈ విశే్లషణలో తేలింది. దేశంలో మొత్తమీద సుమారు 19,500లకు పైగా భాషలను, మాండలికాలను తమ మాతృభాషలుగా కోట్లాదిమంది భావిస్తున్నారు. మాట్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల సమయంలో మొదటిసారిగా మాతృభాషను కూడా చేర్చారు. భాషాపరంగా జనాభా లెక్కలను విశే్లషించి ఇటీవల విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం జనాభాలో 96.71 శాతం మంది రాజ్యాంగంలో చేర్చిన 22 భాషల్లో ఏదో ఒక భాషనే తమ మాతృభాషగా ఉపయోగిస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే భాష మాట్లాడి తీరాలన్న నియమమేదీ లేదు కదా, అందుకే జనాభా లెక్కల సమయంలో కుటుంబ సభ్యులందరినీ విడివిడిగా వారు ఏ భాషలో మాట్లాడుతారో కనుక్కోవడం జరిగిందని భారత జనాభా లెక్కల సెక్రటరీ జనరల్ చెప్పారు. ఈ విధంగా సేకరించిన ప్రాథమిక గణాంకాలను విశే్లషిస్తే దేశంలో మొత్తంమీద 19,569 భాషల మాండలికాలను మాతృభాషగా ఉపయోగిస్తున్నారని తేలిందని నివేదిక పేర్కొంది. వారి మాతృభాష వేరేదైనా సాధారణంగా ఇతరులతో వారు ఏ భాషలో మాట్లాడాలనుకుంటారు, ఏ భాష వారికి సౌకర్యంగా ఉంటుందన్న వివరాలను సేకరించి విశే్లషించి ఈ నివేదిక రూపొందించారు.
రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణంలో పేర్కొన్న 22 భాషల్లో ఏదో ఒకటి మాతృభాషగా ఉన్నవారి శాతం 96.71గా తేలింది. అయితే దేశంలో 270కి పైగా భాషలున్నట్లు వెల్లడైంది. రాజ్యాంగంలోని ఎనిమిదో అధికరణంలో భాషలను మాతృభాషగా వాడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అస్సామీ, బంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ. వీటిలో 14 భాషలు ప్రారంభంలోనే రాజ్యాంగంలో పొందుపరిచారు. 1967లో సింధీ భాషనూ, 1992లో కొంకణి, మణిపురి, నేపాలీ భాషలనూ, 2004లో బోడో, డోగ్రీ, మైథిలీ, సంథాలీ భాషలను రాజ్యాంగంలో చేర్చారు.