జాతీయ వార్తలు

మాన్యుమెంట్ మిత్ర స్కీం.. ఢిల్లీ ఎర్రకోట, ఏపీలో గండికోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: పురావస్తు ప్రాధాన్యత కలిగిన ఐదు హెరిటేజ్ ప్రదేశాల పరిరక్షణకు ఆర్కియాలజీ శాఖ వినూత్న స్కీంను ఆవిష్కరించింది. ఈ స్కీం కింద ఎంపిక చేసిన హెరిటేజ్ ప్రదేశాలకు ‘స్మారక (మాన్యుమెంట్) స్థలాల మిత్ర’ కమిటీలను నియమించాలని ఆర్కియాలజీ శాఖ నిర్ణయించింది. పురావస్తుప్రాంతాలను దత్తత తీసుకోండి అనే లక్ష్యంతో ఈ స్కీంకు రూపకల్పన చేశారు. ఇందులో ఢిల్లీలోని ఎరక్రోట, ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట ప్రదేశాలను చేర్చారు. లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్ అనే సామాజిక కార్యకర్త ఆర్‌టిఐ చట్టం కింద ఈ స్కీం అమలు ఎంత వరకు వచ్చిందో తెలియచేయాలని ఆర్కియాలజీ శాఖను కోరారు. దీంతో ఈ వివరాలను ఆర్కియాలజీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన కేంద్రప్రభుత్వం, దాల్మియా భారత్ గ్రూప్ మధ్య ఈ అంశంపై అవగాహన ఒప్పందం ఖరారైంది. ఈ స్కీం కింద మాన్యుమెంట్ మిత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్కియాలజీ శాఖ పేర్కొంది. ఇంతవరకు అజిమ్ ఖాన్ సమాధి, జమాలి కమాలి హెరిటేజ్, రాజన్ కీ బౌలి, మోత్ కీ మసీదు పరిరక్షణకు కేపర్ ట్రావెల్ కంపెనీతో మాన్యుమెంట్ మిత్ర కింద ఎంఓయూ ఖరారు చేశారు. ఎర్రకోట వద్ద అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని దాల్మియా గ్రూప్ నిర్ణయించింది. సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. ఎర్రకోట వద్ద వీలైనంత త్వరలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓయూలో కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజీ శాఖలకు భాగస్వామ్యం కల్పించారు. ఈ ఒప్పందం ఐదేళ్ల కాలపరిమితికి ఖరారు చేశారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన సాంస్కృతిక శాఖ హెరిటైజ్ సైట్‌ను దత్తత తీసుకోండి, పరిరక్షించండి అనే స్కీం అమలుకు శ్రీకారం చుట్టింది. దేశంలో మరిన్ని హెరిటైజ్ సైట్లను ఈ స్కీం పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు ఆర్కియాలజీ శాఖ పేర్కొంది.