జాతీయ వార్తలు

వంద కోట్ల వితరణశీలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఇదేమీ సినిమా కథ కాదు. నిజంగా జరిగింది. కలికాలంలో కూడా జీవితాంతం సంపాదించిన ఆస్తులను సమాజ హితానికి ఔదర్యంతో, దానం చేసిన వితరణ శీలి వాస్తవ సంఘటన ఇది. బెంగళూరులో ఒక ఐశ్వర్యవంతుడు వంద కోట్ల రూపాయలను రోటరీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ప్రజలకు ఉపయోగపడే మంచినీటి పథకం, పారిశుద్ధ్యం, విద్య, బాలికా సంరక్షణ, బాలికల ఆరోగ్య సంరక్షణ పథకాలకు ఈ నిధులను ఖర్చుపెట్టాలని ఆ ధనవంతుడు రోటరీ సంస్థను కోరారు. ఆ పెద్ద మనిషి పేరు డి రవి శంకర్. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడు.
సమాజంలో బలహీనవర్గాల సముద్ధరణకు ఈ సొమ్మును ఉపయోగించాలని రవిశంకర్ రోటరీ ఫౌండేషన్‌ను కోరారు. ఈ వివరాలను రోటరీ డిస్ట్రిక్ట్ 3190 గవర్నర్ సురేష్ హరి వెల్లడించారు. బెంగళూరు క్రెడాయ్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న సురేష్ హరి మాట్లాడుతూ రవిశంకర్ తండ్రి కామేష్ వినోబాబావే ఇచ్చిన పిలుపుతో భూదానోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ రోజుల్లో తన భూమిని ఈ ఉద్యమంలో భాగంగా దానం ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. తన నాల్గవ ఏటనే రవిశంకర్ తన తండ్రిని కోల్పోయారు. రవిశంకర్ తల్లి పెంపకంలోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి పేదల కష్టాలు ఎలా ఉంటాయో రవి శంకర్ ప్రత్యక్ష్యంగా చూశారు.
రవిశంకర్ విరాళంగా ఇచ్చిన నిధుల్లో 50 శాతం చారిటబుల్ కార్యకలాపాలకు వెచ్చిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నిధులను అభివృద్ధి పనులకు ఖర్చుపెడతామన్నారు. మిగిలిన సగం నిధులను ఆరు ఎంపిక చేసిన పథకాలకు వెచ్చిస్తామని రోటరీ జిల్లా గవర్నర్ సురేష్ హరి చెప్పారు. రవిశంకర్ తాను కలిసి హర హౌసింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామన్నారు. 2025 నాటికి 25 బిలియన్ డాలర్లతో నిధిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రోటరీ ఇంటర్నేషనల్ ఉందన్నారు.