జాతీయ వార్తలు

యూజీసీ రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసి, అదే స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిటీ ఆఫ్ ఇండియా (హెచ్‌ఐసీఐ)ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాపరమైన అంశాల్లో రాజకీయాలు తగవని స్పష్టం చేస్తున్నారు. ఉన్నత విద్యా రంగాన్ని పర్యవేక్షించి, ఆర్థిక పరమైన అంశాలను నియంత్రీకరించే యూజీసీ 1951లో ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది. దశాబ్దాలుగా ఉన్నత విద్యా రంగం పాలన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే, అప్పటి యూజీసీ చట్టంలో లోపాలు ఉన్నాయని, అందుకే, దానిని రద్దు చేసి, హెచ్‌ఇసీఐని ఏర్పాటు చేయాలన్న అలోచనలో ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. కాగా, ఎక్కువ శాతం వంది విద్యావేత్తలు యూజీసీని రద్దు చేయడంలో అర్థం లేదని వాదిస్తున్నారు. కొత్త విధానం వల్ల వనరుల అభివృద్ధి, సేకరణ వంటి అంశాలు సంక్లిష్టమవుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నమేనని పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. హెచ్‌ఇసీఐ నిర్మాణాన్ని పరిశీలిస్తే, ప్రతి నిర్ణయంలోనూ రాజకీయ నాయకుల జోక్యం ఉంటుందని స్పష్టమవుతున్నదని చెప్తున్నారు. పాత లేదా కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రతిపాదిస్తున్న విధానాలు ఏమాత్రం అనుకూలంగా ఉండవన్న వాదన వినిపిస్తున్నది. అంతేగాక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత విద్యా రంగంలో పెరుగుతాయని, ఫలితంగా విదేశీ పెత్తనం పెరుగుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. విద్యా రంగం అభివృద్ధికి యూజీసీని కొనసాగించడమే మేలని సూచిస్తున్నారు.