జాతీయ వార్తలు

‘సింగిల్ శ్లాబ్’ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలులో మార్పులు తేవాలని, ప్రత్యేకించి సింగిల్ శ్లాబ్ విధానాన్ని పాటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. జీఎస్‌టీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన జీఎస్‌టీలో సింగిల్ శ్లాబ్ అనేది భారత్ వంటి విశాలమైన దేశంలో సాధ్యం కాదని జీఎస్‌టీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్‌లో మాట్లాడుతూ అన్నారు. కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్న ప్రజలు గల దేశంలోనే సింగిల్ స్లాబ్ అమలు చేయవచ్చని, కానీ, విభిన్న తరగతుల వారు ఉంటున్న భారత్‌లో అసాధ్యమని పేర్కొన్నారు. మూత్ర పిండాల మార్పిడి శస్తచ్రికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న జైట్లీ కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన వద్ద ఏ శాఖ లేదు. కాగా, దేశం మొత్తానికీ ఒక పన్ను విధానం ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న జీఎస్‌టీపై ఇటీవల కాలంలో విమర్శలు జోరందుకున్నాయి. ప్రస్తుత విధానం వల్ల సామాన్యులు దారుణంగా నష్టపోతున్నారని పలు రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. సింగిల్ శ్లాబ్ విధానంతో ముందుకెళ్లాలని రాహుల్ పలు సందర్భాల్లో కేంద్రానికి సూచించారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ, సింగపూర్ వంటి దేశాల్లో ఆహార ఉత్పత్తులపై ఏడు శాతం స్లాబ్ ఉంటే, విలాస వస్తువులకూ అదే శ్లాబ్ వర్తిస్తుందని చెప్పారు. ఆ విధానాన్ని భారత్‌లో అమలు చేయగలమా? అని ప్రశ్నించారు. పేదలకు సాధ్యమైనంత వరకూ ఊరట కల్పించే విధంగానే జీఎస్‌టీకి రూపకల్పన చేశామని జైట్లీ తెలిపారు. ఒకవేళ సింగిల్ శ్లాబ్ విధానం ఉంటే, ధనికులతో సమానంగా పేదలు కూడా పన్నులు కట్టాల్సి వస్తుందని అన్నారు. ఆర్థికాభివృద్ధితోపాటు, దేశ భవిష్యత్తును, వివిధ వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్‌టీని అమలు చేస్తున్నామని అన్నారు. రాహుల్ ప్రతిపాదించిన సింగిల్ శ్లాబ్ విధానం లోపభూయిష్టంగా ఉందని, దేశ పరిస్థితులకు ఏమాత్రం పనికిరాదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా, పలువురు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్స్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి
పీయూష్ గోయల్, సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తదితరులు