జాతీయ వార్తలు

జమిలికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 8: జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తమ అభిప్రాయాన్ని కేంద్ర లా కమిషన్‌కు తెలియజేశారు. లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఓకేసారి నిర్వహించేందుకు తన సమ్మతిని తెలుపుతూ కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బి. వినోద్ కుమార్ ఆదివారం కేంద్ర లా కమిషన్‌కు అందజేశారు. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో ఇది జరుగుతునే ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము మద్దతు తెలుపుతున్నామని వినోద్‌కుమార్ లా కమిషన్ సమావేశంలో టీఆర్‌ఎస్ వాదన వినిపించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. మొదటిసారి 1983లోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిపే అంశంపై చర్చ ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా బీజేపీ ఈ చర్చను కొత్తగా ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఈ చర్చ చాలాకాలంగా కొనసాగుతునే ఉందన్నారు. దేశాభివృద్ధితోపాటు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా తమ పార్టీ అధినేత కేసీఆర్ లోక్‌సభ, శాసన సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఓకేసారి జరిపేందుకు మద్దతు తెలుపుతున్నారని వినోద్‌కుమార్ ప్రకటించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే వారి దృష్టి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై పడుతుందని, ఇలా జరగటం వల్ల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని తమ పార్టీ అభిమతమని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రతి సంవత్సరం ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. దీని వలన భారీగా ధనం, సమయం వృధా అవుతున్నాయని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి కాబట్టి లోక్‌సభతో కలిపి నిర్వహిస్తే నష్టమేదీ ఉండదని అన్నారు. ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు ఎలావున్నా, జమిలి జరగటం వలన మంచి ఫలితాలు ఉంటాయనేదే తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ, శాసన సభలకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదనే వార్తలపై కొందరు అర్థం లేని వాదనకు తెరతీశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై మాత్రమే చర్చ జరగాలని వినోద్ కుమార్ అన్నారు.
చిత్రం..తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బి. వినోద్ కుమార్