జాతీయ వార్తలు

27న ఆకాశంలో అద్భుతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 8: ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో సుదీర్ఘ చంద్ర గ్రహణం వినీలాకాశంలో దర్శనమివ్వబోతోంది. అపురూపమైన ఈ చంద్రగ్రహణం దాదాపు ఒక గంట 43 నిమిషాల సేపు ఉంటుంది. భారత కాలమాన ప్రకారం ఈ నెల 27వ తేదీ రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ వివరాలను ఎంపీ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి డైరెక్టర్ డాగక్టర్ దేవీ ప్రసాద్ దురాయ్ తెలిపారు. గత 15 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా ఆ సమయంలో భూమికి సమీపంలోకి అంగారక గ్రహం వస్తుంది. బృహస్పతి కంటే రెండు రెట్లు ప్రకాశవంతంగా అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చును. ఈ శతాబ్ధంలోనే అత్యంత సుదీర్ఘకాలం అంటే ఒక గంట 43 నిమిషాల సేపు చంద్రగ్రహణం ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం నాలుగు రోజుల తర్వాత జూలై 31వ తేదీన అంగారక గ్రహం భూమికి చేరువలో 57.6 మిలియన్ కి.మీ నుంచి 55.7 మిలియన్ కి.మీ చేరువలోకి వస్తుంది. గత 60వేల సంవత్సరాల్లో భూమికి సమీపంలో ఇంత చేరువలోకి రావడం ఇదేతొలిసారి అని ఆయన వివరించారు. గతంలో 57613 బిసిలో భూమికి సమీపంలోకి అంగారక గ్రహం వచ్చింది. సూర్యాస్తమం తర్వాత ఆకాశంలో ప్రకాశవంతంగా అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో అరుదైన ఈ దృశ్యాన్ని చూడవచ్చునని డైరక్టెర్ దురాయ్ చెప్పారు. కాని వర్షాకాలమైనందు వల్ల మబ్బులు అడ్డం వస్తే తప్ప ఈ దృశ్యాన్ని తిలకించవచ్చునని చెప్పారు. ఈ నెల 27వ తేదీన భూమికి సరిగ్గా ఎదురు దిశలో అంగారక గ్రహం భ్రమణంలో ఉంటుంన్నారు. సూర్యాస్తమం నుంచి సూర్యోదయం వల్ల వినీలాకాశంలో ప్రకాశించే అంగారక గ్రహణ కనువిందు చేస్తుందన్నారు. టెలిస్కోపుతో మరింత స్పష్టంగా అంగారక గ్రహాన్ని చూడవచ్చన్నారు. 2020 అక్టోబర్ 6వ తేదీన మళ్లీ భూమికి సరిగ్గా ఎదురుగా ఇప్పుడున్న దాని కంటే పెద్దదిగా అంగారక గ్రహం వస్తుందన్నారు. కాని అప్పుడు 61.76 మిలియన్ కి.మీ దూరంలో అంగారక గ్రహం ఉంటుందన్నారు. మళ్లీ 2035, 2087లో ఈ విధంగా భూమికి ఎదురు దిశలో అంగారక గ్రహం వచ్చే దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. కాగా అంగారక గ్రహంలో తలెత్తిన దుమ్ము తుపానుల ప్రభావాన్ని అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారని, దీని ప్రభావం జూలై 31వ తేదీకి తగ్గుముఖం పడుతుందని దురాయ్ చెప్పారు.